Good news for hyderabad people

good news for hyderabad people, Good news for all telangana people, MMTS Trains, Chandrababu MMTS trains, Telangana cm kcr, trs government.

good news for hyderabad people, Good news for all telangana people

నగరవాసులకు శుభవార్త !

Posted: 07/15/2014 09:43 AM IST
Good news for hyderabad people

హైదరాబాదవ్ నగరంలో ఉన్నవారిని శుభవార్త! ఇప్పటి వరకు నగర వాసులను గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ తర్వాత .. త్వరగా చౌకగా ప్రయాణాన్ని సాగించే కీలకస్థానం ఎంఎంటిఎస్ దే... పెరుగుతున్న ట్రాఫిక్ కి అనుగుణంగా నగర రవాణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది అందుకే నగరశివార్లకు విస్తరించేలా ప్రణాళికలు కూడా రూపొందించారు. 2003లో 9 రైళ్లతో ప్రారంభమైన ఎంఎంటిఎస్ మొదటి ఫేజ్ ను నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారు. అప్పుడు కేవలం 9రైళ్ళు 25వేల మంది ప్రయాణికులు . అయితే నగరం విస్తరించడంతో పాటు ప్రయాణంలో సౌకర్యం ఉండటంతో ఎక్కువ మంది ఎంఎంటిఎస్ ను వినియోగిస్తున్నారు..ప్రస్తుతం 20 రైళ్లు , 124 ట్రిప్పులతో రోజూ లక్షా 25 వేల మంది ప్రయాణికులను గమ్యాన్ని చేరుస్తున్నాయి..

ఇటీవలి కాలంలో నగరంలో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగిపోతోంది దీనికి తోడు ఉన్న ఎంఎంటిఎస్ సర్వీసులు అన్ని ప్రాంతాలకు సౌకర్యంగా లేవు దీంతో ఎంఎంటిఎస్ 2వ ఫేస్ ను విస్తరించేందుకు నాలుగేళ్ళ క్రితం ప్రణాళికలు రూపొందించారు..అనేక అవాంతరాల కారణంగా పనులు పట్టాలెక్కలేదు.. తాజాగా ఎంఎంటీఎస్ ఫేజ్ 2 పై రైల్వే శాఖ జిఎం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పటికే పనులు ఆలస్యం అయిన కారణంగా ఈ నెలాఖరుకల్లా పనులు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు.

good-news-for-hyderabad-citizen

ప్రస్తుతం ఉన్న రైల్వే లైన్‌ను రెండు లైన్లుగా విస్తరించడంతో పాటు, బ్రిడ్జీల నిర్మాణం, రోడ్ బెడ్, సిగ్నల్స్‌కు సంబంధించి టెలికాం వర్కులు, విద్యుదీకరణ పనులను జీఎంఆర్ చేపట్టనుంది. టాటా ప్రాజెక్ట్స్, కాళిందీ రైల్ నిగమ్ లిమిటెడ్‌తో కలిసి చేపడుతున్న ఈ పనులు 30 నెలల్లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది.

కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు సకాలంలో నిధులు మంజూరు చేసి. అనుమతుల ప్రక్రియ కాలయాపన లేకుండా చేస్తే 2 సంవత్సరాలలో నగరశివార్ల ప్రజలకు మెరుగైన రవాణ సదుపాయాన్ని కల్పించినట్టవుతుంది. అంటే నగర వాసులకు ప్రయాణం చేయటం ఇంకా సులవుతుంది. దీంతో ప్రయాణ ఖర్చులకు బాగా తగ్గే అవకాశం ఉందని నగర అధికారులు అంటున్నారు. కేసిఆర్ సర్కార్ వేగంతో.. రైల్వే పనులు త్వరగా జరిగితే.. నగరవాసులకు పండగే అని రాజకీయ నాయకులు అంటున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles