Rrb candidates give train passengers the jitters

RRB candidates give train passengers the jitters, Falaknuma Express

RRB candidates give train passengers the jitters, Falaknuma Express

రైల్లో తెలుగు విద్యార్థులపై అరాచక పర్వం!

Posted: 06/30/2014 08:08 AM IST
Rrb candidates give train passengers the jitters

రాష్ట్రం విడిపోయిన తరువాత.. తెలుగు విద్యార్థులపై, తెలుగువారిపై దాడులు ఎక్కువైనాయి. రైళ్ళల్లో దుష్టచతుష్టాలు స్వైర విహారం చేస్తున్నాయి. ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్ , ఒడిషా వాసుల దుర్మార్గాలు మితిమీరుతున్నాయి. ప్రయాణికులపై అరాచకాలకు పాల్పటడంలో ఒకరిని మించి మరోకరు పోటిపడుతున్నారు. అదీ రాష్ట్రంకాని రాష్ట్రమొచ్చి... ఇక్కడున్నవారిపైనే దాడులకు తెగబడుతున్నారు. గత రాత్రి ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ ఘటనతో వారి వికృత చేష్టాలు మరోసారి బయటపడ్డాయి.

సికింద్రాబాద్ నుంచి హౌరా బయలుదేరిన ఫలక్ నామా ఎక్స్ ప్రెస్ లో పలువురు యువకులు వీరంగం సృష్టించారు. వీరందరూ బెంగాల్, ఒడిషాకు చెందినవారు. ఆర్ఆర్‌బీ పరీక్ష కోసం సికింద్రాబాద్ వచ్చారు. తిరుగుప్రయాణంలో తమ వంకర బుద్ది ప్రదర్శించారు. జనరల్ బోగీలతో పాటు రిజర్వేషన్ బోగీలైన S4, S5, S6 బోగీల్లోకి అక్రమంగా ప్రవేశించారు. అంతేగాక వెకిలి చేష్టలతో ప్రయాణికులకు ప్రత్యక్ష నరకం చూపారు. కనీసం టాయిలెట్లకు కూడ వెళ్లనీయకుండా బోగీలను అడ్డంగా ఆక్రమించుకున్నారు.

సికింద్రాబాద్ నుంచి హౌరా వెళ్లిన ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ లో రచ్చ రచ్చైంది. రైల్వే పరీక్షను రాసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు రిజర్వేషన్ బోగీల్లోకి ఎక్కడంతో సామాన్య జనం నానా ఇబ్బందులు పడ్డారు. సికింద్రాబాద్ పరిధిలో జరిగిన ఆర్ ఆర్ బి పరీక్షకు అభ్యర్థులు భారీగా హాజరయ్యారు. తెలుగు విద్యార్థులే కాకుండా ఒరిస్సా, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ ల నుంచి విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వచ్చేటప్పుడు ఎలాగోలా పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. అయితే వెళ్లేటప్పుడు మాత్రం అన్ని రైళ్లు కిక్కిరిసిపోయాయి.

ముఖ్యంగా సికింద్రాబాద్ నుంచి హౌరా వెళ్లే ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ ప్రయాణికులంతా నిండిపోయింది. రిజర్వేషన్ బోగీల్లోకి కూడా అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ఎక్కికూర్చోవడంతో సామాన్య జనం నానా అవస్థలూ పడ్డారు. రెండు వేల మందికి పైగా విద్యార్థులు రైలులో ఎక్కడంతో.... రైలు ఆగిన ప్రతి స్టేషన్ లోనూ ప్రయాణికులకు విద్యార్థులకు మధ్య ఘర్షణ వాతావరం నెలకొంది.

ఇందులో భాగంగానే గుంటూరులో రిజర్వేషన్ లేకుండా రైలులో ప్రయాణిస్తున్నవారందరినీ పోలీసులు కిందకు దింపారు. దీంతో పోలీసులతో విద్యార్థులు గొడవకు దిగారు. పోలీసులు లాఠీ చార్జి చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అయితే సికింద్రాబాద్ - హౌరా, ఫలక్ నామా ఎక్స్ ప్రెస్ లో తెలుగు విద్యార్థులతో కోల్ కతా కు చెందిన యువకులు గొడవకు దిగారు. దీంతో తెలుగు విద్యార్థులు గుంటూరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గుంటూరు రైల్వేస్టేషన్ కు చేరుకున్నారు. ఒక్క గుంటూరు రైల్వే స్టేషన్ లోనే విద్యార్థులు మూడు సార్లు చైన్ లాగడంతో ట్రైన్ గంటకు పైగా నిల్చిపోయింది. గుంటూరులో పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత తిరిగి రైలును పంపిచి వేశారు పోలీసులు. 

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles