L andt gave shock to kcr on hyderabad metro project

telangana cm kcr on metro rail project design, assembly and moinjahi market, metro rail redesign, under ground metro rail project in hyderabad, larsen and trubo agreement with ap government, elevated metro project in hyderabad

L andT gave shock to KCR on Hyderabad Metro Project

కేసిఆర్ కు ఎల్ అండ్ టీ షాక్ ? మెట్రోరైలుకు రాంరాం

Posted: 06/30/2014 08:55 AM IST
L andt gave shock to kcr on hyderabad metro project

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కు ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ ఎల్ అండ్ టీ షాక్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని జరుగుతున్న మెట్రో రైలు ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మెట్రో పనులపై.. సీఎం కేసిఆర్ దృష్టిపడింది. కొన్ని కొత్త కోరికల చిట్టాను ఎల్ అండ్ టీ ముందు సీఎం కేసిఆర్ ఉంచటం జరిగింది. దీంతో ఎల్ అండ్ టీ కేసిఆర్ కోరికల చిట్టాను చూసి ఒక్కసారిగా షాక్ తిన్నట్లు సమాచారం.

టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మేము చాలా నష్టపోవాల్సి వస్తుందని ఎల్ అండ్ టీ సంస్థ గట్టిగానే చెబుతుంది. దీంతో మెట్రో రైలు ప్రాజెక్టు నుండి తప్పుకోవటానికి సిద్దమైనట్లు సమాచారం. దీంతో, ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మెట్రోకు కష్టాలు ప్రారంభమయ్యాయి. చారిత్రక, వారసత్వ కట్టడాలున్న (అసెంబ్లీ, సుల్తాన్ బజార్, బడీచౌడి, మొజాంజాహీ మార్కెట్ ...) ప్రాంతాల్లో మెట్రోను అండర్ గ్రౌండ్ లో నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీపై ఒత్తిడి తెచ్చారు. దీంతో, ఇప్పటికే పనులన్నీ ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ఈ మెలిక పెట్టడమేమిటని ఎల్ అండ్ టీ ప్రశ్నిస్తోంది. పిల్లర్లు కూడా నిర్మితమైన తర్వాత అలైన్ మెంట్ మార్పు ఏమిటని నిలదీస్తోంది. దీంతో టీఆర్ఎస్ ప్రభుత్వం , ఎల్ అండ్ టీ ల మద్య మెట్రో వార్ నడుస్తుంది. దీంతో మెట్రో రైలు వస్తుందా? లేక ఆగిపోతుందా? అనే సందేహం తెలంగాణ ప్రజలకు కలుగుతుంది.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles