Land registrations doubled in mangalagiri

land registrations doubled in Mangalagiri, Cinema actors investing in Guntur and Vijayawada areas,

land registrations doubled in Mangalagiri

మంగళగిరిలో రెట్టింపైన రిజిస్ట్రేషన్లు!

Posted: 06/29/2014 04:28 PM IST
Land registrations doubled in mangalagiri

ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ గుంటూరు మధ్య ఉండవచ్చన్న వార్తలు ఊపందుకోవటంతో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దగ్గర, గుంటూరు, విజయవాడ, మంగళగిరి, గన్నవరం ప్రాంతాలలో చకచకా కొనుగోళ్ళు జరుగుతున్నాయనటానికి మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ మాందాసు శ్రీనివాసరావు ఇచ్చిన క్లూ చాలు.  

మే 2014 తర్వాత మంగళగిరిలో ల్యాండ్ రిజిస్ట్రేషన్లు రెట్టింపయ్యాయట.  రోజుకి 50 వరకు ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు నడుస్తున్నాయని శ్రీనివాసరావు తెలియజేసారు.  

వీలయిన అన్ని చోట్లా వీలయినంత భూమిని కొనుగోలు చెయ్యటానికి సినిమా స్టార్లు, రాజకీయ నాయకులు, ప్రస్తుత మాజీ ప్రజాప్రతినిధులు పోటీలు పడి కొంటున్నారని తెలిసింది.  

మొన్నటివరకు హైద్రాబాద్ ని వదులుకోము అని వాళ్ళు కూడా వీలయినంత త్వరగా ఆంధ్రప్రదేశ్ లో అదికూడా విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టాలని తపనపడుతున్నట్లుగా తెలుస్తోంది.

అలా రిజిస్ట్రేషన్లు చేసారని బయటకు వచ్చిన వారిలో రవితేజ ఎన్టీఆర్ పేర్లు కూడా వున్నాయి!  భూములు కొన్నివారిలో ఇంకా కృష్ణ, కృష్ణంరాజు, శ్రీకాంత్, అశ్వనిదత్ ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles