Kiran kumar reddy last moment sanctions stayed by chandrababu

Kiran Kumar last moment sanctions in suspension, Kiran Kumar sanctioned projects in trouble, Chandrababu takes a dig at Kiran Kumar santioned projects

Kiran Kumar Reddy last moment sanctions in suspension by Chandrababu

కిరణ్ చివరి పావులకు ముప్పు

Posted: 06/29/2014 03:48 PM IST
Kiran kumar reddy last moment sanctions stayed by chandrababu

కిరణ్ కుమార్ రెడ్డి పదవిని వదిలే ముందు ఆయన ఆఫీసు ముందు ఎందరో పైరవీకారులు, లబ్ధిదారులు, ఉన్నతోద్యోగులు క్యూలు కట్టి మరీ తమ పనులను చేయించుకున్నారన్న విషయం అప్పట్లో అన్ని వార్తా పత్రికలూ కోడై కూసాయి.  చేతులు అరిగేలా సంతకాలు పెట్టేస్తున్నారంటూ కొందరు ఎద్దేవా చేసారు.  

గద్దె దిగటానికి నిమిషం ముందు కూడా ఆయన ముఖ్యమంత్రే కాబట్టి ఆయన జారీ చేసిన ఆదేశాలకు విలువనివ్వాల్సిందే.  కానీ మరీ తెలంగాణా రాష్ట్రం ఏర్పడుతోందన్నది రూఢిగా తేలిపోయి దాన్ని అడ్డుకోవటానికి తనదగ్గరున్న అన్ని పావులనూ ఉపయోగించి ఆడినా ఇంకేమీ మిగల్లేదని అర్థమైన తర్వాత  చేసిన ఒప్పందాలు, ఇచ్చిన వరాలను సమీక్షించే ప్రయత్నంలో పడింది తెలుగుదేశం పార్టీ.  వాటి మీద ఇంత వరకు ఏమైనా చెల్లింపులు చేసున్నా ఇక ముందు వాటిలో దేనికీ చెల్లింపులు చెయ్యరాదని అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.   

ఇక పరిస్థితి చెయిజారిపోయిందని అందువలన తమ్ముడి పేరుతో కథ నడిపిస్తూ సాధ్యమైనంత దండుకుందామనే ప్రయత్నం చేసారని విమర్శలు కూడా అప్పట్లో వచ్చాయి.  

ఈ నేపథ్యంలో ఆఖరి రోజుల్లో కిరణ్ కుమార్ మంజూరు చేసిన ప్రాజెక్ట్ ల మీద ప్రత్యేక దృష్టి పెట్టిన చంద్రబాబు నాయుడు ముందుగా వాటికి సంబంధించిన బిల్లుల చెల్లింపులను నిలిపివేసారు.  అందులో చాలావాటిని ఇప్పటి ప్రభుత్వం రద్దు చెయ్యవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles