Digvijay singh comments on rahul

Digvijay Singh comments on Rahul, Rashid Alvi expresses complete faith on Rahul, Rahul should be opposition leader Digvijay says

Digvijay Singh comments on Rahul

ఎంత చేసినా చిన్న విమర్శ అంతా కడిగేస్తుంది!

Posted: 06/29/2014 03:23 PM IST
Digvijay singh comments on rahul

కాంగ్రెస్ పార్టీ ఛీఫ్ సెక్రటరీగా పార్టీ అధిష్టానానికి అనుకూలంగా పనిచేసిన దిగ్విజయ్ సింగ్ అవసరాన్నిబట్టి తన వ్యాఖ్యలను మారుస్తూ తనకంటూ ప్రత్యేకమైన అభిప్రాయాలేమీ లేవని, కేవలం తాను ఒక విశ్వాసపాత్రుడనేనని పలుమార్లు నిరూపించుకున్నారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో దిగ్విజయ్ సింగ్ పోషించిన పాత్ర, మధ్యమధ్య చేసిన ప్రకటనలు పరస్పర వ్యతిరేకాలుగా ఉన్నా ఆయనెప్పుడూ వాటి ప్రభావం తన వ్యక్తిగత ఇమేజ్ మీద ఎలా ఉంటుందాన్నది చూసుకోలేదు.  

రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలని తాను కోరుకున్నాను కాని కర్నాకట నుండి మల్లిఖార్జున ఖర్గేకి ఆ పదవినిచ్చారని అన్న దిగ్విజయ్ సింగ్, రాహుల్ ఎప్పుడూ అన్యాయాన్ని ఎదిరించేవారని, ఆయన పదవి కోసం ప్రాకులాడకపోవటమే ఆయనను ఇతరులకంటే భిన్నంగా కనిపించేట్టుగా చేస్తుందని కూడా అన్నారు.   కానీ రాహుల్ కి నాయకత్వ లక్షణాలు కొరవడ్డాయని కూడా ఆయన అనటంతో కాంగ్రెస్ పార్టీలోను ఇతర పార్టీలలోను సంచలనం సృష్టించింది.  

దాని ప్రభావాన్ని తక్కువ చెయ్యటం కోసం కాబోలు కాంగ్రెస్ నాయకుడు రషీద్ అల్వీ ఈ రోజు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వం మీద సంపూర్ణమైన నమ్మకం ఉందని అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles