Foreign investors queuing up to meet modi

Foreign investment in Defense equipment, Foreign investors queuing up to meet Modi, Modi first to opt for defense production

Foreign investors queuing up to meet Modi

మేమంటే మేమంటూ మోదీని కలవనున్న విదేశీ పెట్టుబడిదారులు!

Posted: 06/29/2014 12:08 PM IST
Foreign investors queuing up to meet modi

ఇంతవరకు మనం రక్షణ శాఖకోసం ఆయుధాలను యుద్ధ సామగ్రిని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ వస్తున్నాం.  ఈ మధ్యనే గోవాలో నావికాదళ విన్యాసాలను చూసి ఆనందాశ్చర్యాలను వ్యక్తపరచిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆ పరికరాలన్నిటినీ చూసిన తర్వాత వీటిని మనం ఇతర దేశాలనుంచి ఎందుకు కొనుక్కుంటున్నాం, మనమెందుకు ఉత్పత్తి చెయ్యటం లేదు అని అన్నారు.   

ఆ తర్వాత అందుకు ముందడుగులు కూడా వెయ్యటం మొదలుపెట్టారు.  విదేశీ పెట్టుబడులతో భారత్ లో డిఫెన్స్ ఇండస్ట్రీని నెలకొల్పటానికి సన్నాహాలు జరుగుతున్నాయి.  ఆయుధాలు, పరికరాలను దిగుమతి చేసుకోవటంలో ప్రపంచంలోనే పెద్ద దేశమైన భారత్ ని అతి పెద్ద ఉత్పాదన చేసే దేశంగా మార్చుదామనే ఆలోచన ఇంతవరకూ ఏ ప్రధాన మంత్రీ చెయ్యనది.  

ఈ వార్త పాకటంతోనే విదేశీ పెట్టుబడిదారులంతా మోదీని కలవటానికి క్యూ కడుతున్నారు.  ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న మోదీ చెప్పింది చేస్తారనే నమ్మకం ఉండటంతో అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ నుంచి ఒకరి తర్వాత మరొకరుగా వచ్చే 10 రోజులలో మోదీతో సంప్రదింపులు జరుపబోతున్నారు.  కొన్ని ఉత్పత్తుల మీద పూర్తిగా విదేశీయుల ఆధిపత్యం ఉండబోతోంది.  దానితో ప్రపంచంలోని ఆగ్ర దేశాలు భారత్ లో పెట్టుబడి పెట్టటానికి ఉత్సుకతను చూపిస్తూ పోటీలు పడుతున్నాయి.  

భారతదేశానికి యుద్ధ సామగ్రిని సరఫరా చేసినవారిలో అగ్రస్థానంలో ఉన్న రష్యా కూడా తమ దేశ ప్రతినిధిని మోదీతో సంప్రదింపులు జరపటానికి పంపుతోంది.  

భారత దేశం గత సంవత్సరం డిఫన్స్ కోసం 36000 కోట్ల రూపాయలను ఖర్చుచేసింది.  అందువలన విదేశీ పెట్టుబడులను ఆకర్షించటం కోసం ఇంతవరకు విదేశీ పెట్టుబడులకున్న 26 శాతం పరిమితిని పెంచుతూ భాజపా ప్రభుత్వం 49 శాతానికి పెంచే ప్రతిపాదనకు నాంది పలుకుతోంది.  దీని మీద ఇంకా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అంతిమ నిర్ణయాన్ని తీసుకోవటం మిగిలివుంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles