Kcr fire on andhra pradesh name boards

telangana cm k chandrasekhar rao, kcr fire on andhra pradesh name boards, andhra pradesh name plates, telangana cm kcr, telangana state, andhra pradesh name plates issue

kcr fire on andhra pradesh name boards

30 తరువాత ఆంద్ర ఉంటే తాటతీయ్యండి? కేసిఆర్

Posted: 06/28/2014 03:38 PM IST
Kcr fire on andhra pradesh name boards

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తొలి అడుగులు బలంగానే వేస్తున్నాడు. తెలంగాణ రాష్ట్ర మార్కు ను తెచ్చేందుకు ఆయన తీవ్రంగా కృషి చేస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ అధికారులకు కొండంత బలంగా సీఎం కేసిఆర్ మారారు. సీఎం ఫేషీ నుంచి ఏ నోటీసు వచ్చిన వెంటనే క్షణాల్లో అధికారులు పూర్తి చేస్తున్నారు. అందుకు నిదర్శనం.. గురుకుల , అయ్యప్పసోసైటీ అక్రమ కట్టడాలను కూల్చిన విధానమే.

అయితే సీఎం కేసిఆర్ మరో సంచలనమైన .. ప్రకటన చేసి, నగరంలో అలజడి రేపారు. ఇక నుండి తెలంగాణ రాష్ట్రంలో ఆంద్రప్రదేశ్ బోర్డులను తీసేయాలని .. అధికారులకు ఆదేశాలు జారీ చేయటం జరిగింది. దీంతో ప్రభుత్వంలో తెలంగాణలో ఉన్న ఆంద్రప్రదేశ్ బోర్డులను తొలగింపుకు రంగం సిద్దమైంది. ఆంధ్రప్రదేశ్ స్థానంలో తెలంగాణ పేరు పెట్టుకోవాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి.

ప్రభుత్వ కార్యాలయాలతో పాటు, ప్రైవేటు సంస్థలు కూడా తమ బోర్డుల్లో ఆంధ్రప్రదేశ్ స్థానంలో తెలంగాణను మార్చుకోవడానికి 30 రోజుల గడువు విధించారు. గడువు దాటిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ పేరు అలాగే కనిపిస్తే... లేబర్ డిపార్ట్ మెంట్ జరిమానా విధిస్తుంది. ఇటీవల సెక్రటేరియట్ లో ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో... హైదరాబాద్ నగరంలోని బోర్డులపై ఇంకా ఆంధ్రప్రదేశ్ కనిపిస్తుండటంపై ముఖ్యమంత్రి కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు.

దీంతో నగరంలోని వ్యాపారస్తులు, ప్రభుత్వ అధికారులు.. సైన్ బోర్డు తయారీ చేసే షాపుల ముందు క్యూ కడుతున్నారు. కొంతమంది అయితే పక్క రాష్ట్రంలో ఉన్న సైన్ బోర్డు, ప్లేక్సీల రెడీ చేసే వారి వద్దకు వెళ్లి ఒక రోజు ఉండి మరీ ‘‘తెలంగాణ రాష్ట్రం’’ అని ఉన్న బోర్డులు తయారు చేయించుకొని తెచ్చుకున్నారు. సీఎం కేసిఆర్ పుణ్యంతో.. నగరంలోని పేర్లు రాసే , పెక్సీలు , సైన్ బోర్డ్స్ చేసే వారికి నాలుగు పైసల్ రాబడి దక్కింది. దీంతో వారు చాలా ఆనందంగా 30 రోజులు రాత్రి, పగలు కష్టపడుతూ.. నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Health minister dl ravindra reddy
Vanpic case brahmananda reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles