Health minister dl ravindra reddy

Health Minister Dl Ravindra Reddy, Blood, Blood donation camp, Minister, Congress party, 18 years above, Youth, blood bank,

Health Minister Dl Ravindra Reddy

Ravindra.gif

Posted: 10/02/2012 11:24 AM IST
Health minister dl ravindra reddy

Health Minister Dl Ravindra Reddy

రాష్ట్రంలో  ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్  రవీంద్ర రెడ్డి కొత్త పథకం ప్రవేశపెడుతున్నారు. ఆంద్రప్రదేశ్ లో ఉన్న ఎవరైన 18 సంవత్సరాల వయసు నిండినవారు తప్పనిసరిగా  ఈ పథకంలో చేరాలని ఆయన అంటున్నారు. ప్రతి ఒక్కరు ఈ పథకాన్ని వినియోగించుకోవాలని  ఆయన చెబుతున్నారు.రాష్ట్రంలోని బ్లడ్ బ్యాంకులు, వాటిలో లభించే వివిధ గ్రూపుల రక్తం వివరాలన్నింటినీ ఆన్‌లైన్‌లో పెడతామని రాష్ట్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ప్రకటించారు. అక్టోబర్ 1న జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా  నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసై టీ, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్స్ స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించాయి.  ఈ శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి డీఎల్ మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు బ్లడ్ బ్యాంకులు 244 వరకు ఉన్నాయన్నారు. వీటిని ఆన్‌లైన్ ద్వారా అనుసంధానించనున్నామని.. ఫలితంగా ఏ బ్లడ్ బ్యాంకులో ఏ గ్రూపు రక్తం, ఎంత పరిమాణంలో ఉందో తెలుసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. రక్తసేకరణలో 91 శాతం వరకు సఫలీకృతులమవుతున్నామని చెప్పారు. 18 ఏళ్లు నిండిన ప్రతి వ్యక్తీ రక్తదానం చేయాలన్న నిబంధనను అమలు చేయాలన్న యోచనలో ఉన్నామని వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles