Gas pipe line blast in east godavari

gas pipe line blast in east godavari, gas leak caused fire at nagaram eg district, ongc negligence causes fire and deaths, 14 died in gas pipe line blast in eg district

gas pipe line blast in east godavari

ఒఎన్ జిసి నిర్లక్ష్యం ఖరీదు 14 నిండు ప్రాణాలు

Posted: 06/27/2014 12:52 PM IST
Gas pipe line blast in east godavari

ఈరోజు ఉదయం తూర్పు గోదావరి జిల్లా మామిడి కుదురు మండలం నగరం గ్రామంలో గ్యాస్ పైప్ లైన్ పేలి ఆ మంటలలో చిక్కుకున్నవారిలో 14 మంది అప్పటికప్పుడే మరణించారు, పరిస్థితి చూస్తుంటే మృతుల సంఖ్య ఇంకా పెరిగేలా ఉంది.  తీవ్రంగా గాయపడ్డ 15 మందిని అమలాపురం, కాకినాడ హాస్పిటల్స్ కి తరలించటం జరిగింది.  

గెయిల్ ఛైర్మన్ బిసి త్రిపాఠి ఇచ్చిన వివరం ప్రకారం, ఒఎన్ జిసి రిఫైనరీకి దగ్గర్లో 18 అంగుళాల గ్యాస్ పైప్ లో మంటలు అంటుకున్నాయి.  ఉదయం 6.00 గంటల ప్రాంతంలో జరిగిన ఈ దుర్ఘటనకు కారణం ఇంకా తెలియలేదు.  

పెద్ద పెద్ద శబ్దాలతో మంటలు 250 మీటర్ల ఎత్తున ఎగసిపడుతుంటే స్థానికులు ప్రాణాలను అరచేతిలో పట్టుకుని పరుగులు తీసారు.  ఇప్పటికే 50 ఇళ్ళు, దుకాణాలు దగ్ధమయ్యాయి.  వందలాది కొబ్బరి చెట్లు కాలిపోయాయి.  

అగ్నిమాపక దళాలు వచ్చి మంటలను అదుపులోకి తీసుకునేలోపులోనే భారీగా ఆస్తినష్టం, ప్రాణ నష్టం జరిగింది.  దీనికంతటికీ కారణం అధికారుల నిర్లక్ష్యమేనని స్థానికులు ఆరోపిస్తూ, ఎప్పటి నుంచో గ్యాస్ లీక్ గురించి చెప్తున్నా ఒఎన్ జిసి అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసారు.

పైప్ లైన్లు తుప్పపట్టి తరచుగా గ్యాస్ లీక్ అవటం జరుగుతుంటుందని, అందుకు ప్రత్యామ్నాయ చర్యలను చేపట్టాలని స్థానికులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న నాథుడు లేకపోయాడని అంటున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles