ప్రపంచ వ్యాప్తంగా ఆదివాసుల హక్కులను పరిరక్షించటానికి ఏర్పడ్డ స్వచ్ఛంద సంస్థ సర్వైవల్ ఇంటర్నేషనల్ పెరు రెయిన్ ఫారెస్ట్ లో ఇంకా సభ్యసమాజానికి, నాగరికతలు అంటని కొన్ని జాతులు నివసిస్తున్నాయని తెలియజేయటం కోసం ఫోటొలను విడుదల ఎందుకు చెయ్యవలసివచ్చిందంటే, పెరు అధ్యక్షుడు అటువంటివన్నీ ఊహాగానాలే కానీ నిజంగా అలాంటి జాతులు ఎక్కడా లేవని గట్టిగా చెప్పటం వలన.
పెద్ద పెద్ద ఆయిల్ కంపెనీలు స్థాపించే పైప్ లైన్ల వలన ఆదాయం పెరుగుతుందన్న ఉద్దేశ్యంతో పెరు అధ్యక్షుడు అటువంటి ప్రకటనలు చేసారని అంటోంది నోరులేని ఆ మూగ జాతుల తరఫున మాట్లాడటానికి సిద్ధమైన ఆ స్వచ్ఛంద సంస్థ సర్వైవల్ ఇంటర్నేషనల్. అమెజాన్ అడవుల్లో 70 శాతం ప్రాంతాన్ని చమురు అన్వేషణ, అభివృద్ధి కోసం కేటాయించిందా ప్రభుత్వం. ఆ కార్యక్రమం అడవిలో వాళ్ళ మానాన్న వాళ్ళు జీవించే ఆ జాతులను నాశనం చేస్తుందంటుంది ఆ స్వచ్ఛంద సంస్థ. వాళ్ళ బ్రతుకులు వాళ్ళవే కానీ బయటి ప్రపంచాన్ని చూడని ఆ జాతులు మొదటిసారిగా తమ జీవితంలో చూసేవి ఆ చమురు పైపులే అంటోంది.
ఇంతవరకు మేమైతే అలాంటి వాళ్ళని చూడలేదు అంటారు పెరు ఆయిల్ ఛీఫ్. అవన్నీ కట్టు కథలు అంటారు పెరు అధ్యక్షుడు. కానీ ఈ ఫోటోలు ఇంకా అటువంటి జాతులు వారివైన ఆచార వ్యవహారాలతో జీవిస్తున్నారని నిరూపిస్తున్నాయని స్వచ్ఛంద సంస్థ అంటోంది.
చమురు నిక్షేపాల కోసం పెరు మధ్యనుంచి పైప్ లైన్ కోసం తవ్వకాలు సాగుతాయని, అవి ఆ అడవిజాతుల మధ్య నుంచి పోతాయని అంటోంది సర్వైవల్ సంస్థ. ఆ ప్రాంతం నుంచి 300 మిలియన్ బ్యారల్స్ చమురుని తీయాలన్నిది ప్రాజెక్ట్ లక్ష్యం. పెరు ప్రభుత్వానికి ఇది ఆర్థికంగా లాభిస్తుందని పెరు అధ్యక్షుడు గర్షియా ఈ ప్రాజెక్ట్ ని ఆమోదించారు.
{youtube}sLErPqqCC54|620|400|1{/youtube}
ఇప్పటికే చాలా చమురు సంస్థలు ఆ అడవిజాతుల జీవన శైలికి అంతరాయం కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సర్వైవల్ సంస్థ కి చెందిన స్టీఫెన్ కోర్రీ. బహుశా చమురు ఉపయోగం లేని వాళ్ళల్లో భూమ్మీద మిగిలిన మానవజాతి అదేనేమో కానీ వాళ్ళకి అవసరం లేని ఆ చమురు వాళ్ళ జీవితాలను అతలాకుతలం చేస్తుంది అంటారాయన. చమురు అన్వేషణలో తరచుగా ప్రమాదాలు సంభివిస్తుంటాయి. కానీ ఆ ప్రమాదాలలో అందులో ప్రమేయంలేని అడవి జాతి బలవటం జరుగుతుందని, అందువలన ఆ ప్రాజెక్ట్ ని రద్దు చెయ్యమని ప్రభుత్వాలను అర్థిస్తున్నామని, ఈ విషయాలను ప్రపంచానికి చాటిచెప్పటానికే మా ఈ ప్రయత్నం అంటోంది ఆ సంస్థ.
బ్రెజిల్ లోని ఎన్విరాన్ మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ చేసిన ప్రకటన ప్రకారం, బ్రెజిల్ పెరు సరిహద్దుల్లో 28 అనుమతులులేని సా మిల్స్ ని మూసివేయించటం జరిగింది. బ్రెజిల్ లోని నేషనల్ ఇండియన్ ఫౌండేషన్ అంచనా ప్రకారం అటువంటి జాతులు 68 బ్రెజిల్ లో ఉన్నాయి. అందులో 24 జాతులను మాత్రమే గుర్తించటం జరిగింది.
ఇక ఆ ఫొటోలను పక్కకు పెట్టెయ్యవచ్చు. ఎందుకంటే పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఆ జాతులెలాగూ మిగలవు అన్నారు అడవి జాతులను పరిరక్షించటానికి ప్రభుత్వం చేసే హడావిడిలో కో అర్డినేటర్ గా పనిచేసే జోస్ కార్లోస్ మీరెల్స్.
వెయ్యి నివేదికలిచ్చే దానికంటే ఒక్క ఫొటో ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్వచ్ఛంద సంస్థ ఈ ఫొటోలను ప్రపంచానికి చూపిస్తోంది. కింద ఏరియల్ ఫుటేజ్ వీడియో చూడవచ్చు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more