Telangana local for fees reimbursedment to students

telangana local for fees reimbursedment to students, fees reimbursements to telangana students, kcr to consider students’ father’s nativity, american citizednship easier than telangana nativity

telangana local for fees reimbursedment to students

టిజి స్థానికతకంటే యుఎస్ పౌరసత్వం సులువా?

Posted: 06/27/2014 11:10 AM IST
Telangana local for fees reimbursedment to students

తెలంగాణాలో స్థానికత కంటే అమెరికాలో పౌరసత్వం సంపాదించటమే సులభమేమో అంటున్నారు కొందరు విశ్లేషకులు.  

అమెరికాలో జన్మిస్తేనే చాలు నేటివిటీ వచ్చేస్తుంది.  వాళ్ళ తల్లిదండ్రులకు సిటిజన్ షిప్ లేకపోయినా పరవాలేదు  అమెరికన్ సిటిజన్ అయిపోతాడు.  అమెరికాలో ఐదు సంవత్సరాలు నివాసముంటే సిటిజన్ షిప్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టవచ్చు.  అలా అమెరికన్ సిటిజన్ షిప్ పొందినవారికి ఆ ప్రభుత్వం కలిగిస్తున్న వెసులుబాట్లు, సదుపాయాలు సంపూర్ణంగా అందుతాయి.  

కానీ ప్రస్తుతం నడుస్తున్న చర్చల ప్రకారం, ప్రొఫెషనల్ కోర్సులు చేసే విద్యార్థులకు ఇచ్చే ఒక్క ఫీజు రియంబర్స్ మెంట్ పొందటానికి తెలంగాణాలో స్థానికత కోసం అక్కడ పుట్టినంత మాత్రాన సరిపోదు.  ఆ విద్యార్థి తండ్రి కూడా తెలంగాణాలో పుట్టివుండాలి.

స్థానికత, పౌరసత్వం అనే గుర్తింపుల పట్టింపులు ఎప్పుడు వస్తాయంటే, ప్రభుత్వం వాళ్ళకి కొన్ని ప్రత్యేక సదుపాయాలను కట్టబెడుతున్నప్పుడు.  అమెరికన్ ప్రభుత్వం ఆ దేశ పౌరులకు అందిస్తున్న ప్రయోజనాలతో పోలిస్తే తెలంగాణాలో ఫీజ్ రియంబర్స్ మెంట్ అనేది కొద్ది మందికే ఒనగూడేది, అది కూడా చాలా తక్కువ ప్రమాణంలోనే.  

అయితే, తెలంగాణా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు కొత్తగా ఆవిర్భవించినవి, నిలదొక్కుకోవటానికి ప్రయత్నం చేస్తున్నవి కాబట్టి కొన్ని కఠినమైన నిర్ణయాలను తీసుకోక తప్పదు.  అవి అర్థం కానప్పుడు కక్ష సాధింపు చర్యలా వేర్పాటు భావనను పెంచే వ్యాఖ్యగా కనిపిస్తుంది.  అందరికీ ప్రయోజనాన్ని కలిగించలేనప్పుడు, కొందరిని తొలగించాల్సివచ్చినప్పుడు ఏదో ఒక ప్రాతిపదికను ఆ పని చెయ్యవలసివస్తుంది.  98 శాతం మార్కులు వచ్చిన విద్యార్థి కూడా 99 శాతం మార్కులు వచ్చిన విద్యార్థి వలన వెనకబడిపోతాడు.  98 శాతం మార్కులేమైనా తక్కువా, అతనికి ఎందుకు అవకాశం ఇవ్వటం లేదు అని అడిగితే ఉన్న స్థానాలకంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు ప్రధానంగా మార్కులను కాక మరింకేమి చూస్తారు.  అలాగే తెలంగాణా విద్యార్థులకే ఫీజ్ రియంబర్స్ మెంట్ ఉంటుంది- అది కూడా ఆ విద్యార్థి స్థానికతనుబట్టి, విద్యార్థి తండ్రి స్థానికతనుబట్టి అన్నప్పుడు అది స్క్రీనింగ్ కి పనికివస్తుంది.  ఇది జల్లెడపట్టే విధానం.  షార్ట్ లిస్ట్ చెయ్యటం కూడా అవసరమే కదా!

10 ఉద్యోగాలకు ఖాళీలున్నచోట 1000 మంది వస్తే ఏం చేస్తారు?  ముక్కు ముఖం బాగోలేదనో, మాట్లాడే తీరు బాగోలేదనో, నడిచే విధానం సరిగ్గా లేదనో, నవ్వు ప్లాస్టిక్ నవ్వులా ఉందనో ఏదో వంకన కొందరిని తగ్గించేయాలి.  అందుకే ఇంటర్వ్యూలుంటాయి.  ఇంటర్వ్యూలలో చాలామందిని రిజెక్ట్ చెయ్యటానికి అవకాశం ఉంటుంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles