39 years ago indira gandhi declared emergency

Indira Gandhi Emergency , 39 years ago Indira Gandhi declared Emergency, Indira Gandhi, declared Emergency, 39 years since.

39 years ago Indira Gandhi declared Emergency

ఇందిరా ‘ఎమర్జెన్సీ ’కి 39 ఏళ్లు..?

Posted: 06/26/2014 08:45 AM IST
39 years ago indira gandhi declared emergency

ఈరోజు కి సరిగ్గా.. 39 ఏళ్లు నిండాయి. 1975 జూన్ 25 ఎమర్జెన్సీ విధించి ఈరోజు అక్షరాల 39 ఏళ్లు అవుతోంది. జూన్ 1975 నుంచి మార్చి 1977 వరకు 21 నెలల కాలంలో దేశంలో అరాచకం రాజ్యమేలింది. ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ ఎన్నికలను, ప్రజల స్వేచ్ఛను నియంతలా హరించిన చీకటి రోజులవి. రాజకీయ నాయకులను, కార్మికనాయకులను, సామాన్యులను ముప్పుతిప్పలు పెట్టిన రోజులవి.

స్వాతంత్రం వచ్చిన ఇందిరాగాంధీ పాలనలో చూసిన ఎవర్జెన్సీ రోజులు అనుభవించారు భారతీయులు . అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆదేశాల మేరకు రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 352 ప్రకారం ఎమర్జెన్సీ విధించారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు, చట్టం ద్వారా లభించే రక్షణలు అన్నీ ఇందిరా ప్రభుత్వం లేకుండా చేసింది. దేశాన్ని, ఈ దేశ ప్రజలను రక్షించేందుకే ఎమర్జెన్సీ విధించినట్టు అప్పట్లో ఇందిరా చెప్పుకొచ్చారు. ఎన్నికలను బహిష్కరిస్తూ, ప్రజల హక్కులను హరించేస్తూ నియంతృత్వ ధోరణిలో ఆ రోజుల్లో ఇందిరాగాంధీ ప్రవర్తించారు. ఇందిరాగాంధీ తీరుపట్ల అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి.

1967, 1971 కాలంలో ఇందిరాగాంధీ అటు ప్రధానిగా రాజకీయాల్లో, పార్టీ అధినేత్రిగా గట్టి పట్టు సాధించారు. పార్లమెంట్‌లో తన పార్టీకి భారీ మెజారిటీ ఉండటంతో ఎవ్వరిని లెక్కచేయకుండా నియంతలా ప్రవర్తించసాగారు. ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ రాజకీయ ప్రత్యర్థులంతా జైలు పాలయ్యారు. పత్రికా స్వేచ్ఛ గొంతు నొక్కేలా వార్తాపత్రికలు సెన్సార్‌కు గురయ్యాయి. ఈ రాజకీయ అస్థిరతను ముందే గ్రహించిన ఇందిరా.... ప్రధాని పదవి కాపాడుకోవాలన్న కోరికతో చీకటి అధ్యాయానికి తెరలేపారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles