Gas price revision deferred by 3 months

Gas price revision deferred by 3 months, gas prices, Dharmendra Pradhan, gas price revision, NDA government, Narendra Modi government, CNG Gas, Price Formula, Dharmendra Pradan, Narendra Modi,

Gas price revision deferred by 3 months

మోడీ బాదుడు వాయిదా

Posted: 06/26/2014 09:05 AM IST
Gas price revision deferred by 3 months

ఈరోజు మోడీ సర్కారు మొదలైయి మూడుపదులు పూర్తి చేసుకుంది. అయితే మూడుపదుల వయసులోనే జెట్ స్పీడ్ తో మోడీ ప్రభుత్వం దూసుకుపోతుంది. ఈ ముప్పై రోజుల్లోనే మోడీ ప్రభుత్వం ప్రజలకు వాతలు పెట్టిన విషయం తెలిసిందే. రైల్వే ఛార్జీలు భారీగా పెంచి , ప్రజల్లో ఒక్కసారిగా వ్యతిరేకత తెచ్చుకున్నారు. మళ్లీ వెంటనే మోడీ సర్కారు కన్ను .. వంట గ్యాస్ పై పడింది. నెలకు 5 రూపాయలు చొప్పన పెంచటానికి సిద్దమైంది. కానీ ఈ సారీ మాత్రం మోడీ బాదుడికి కొంచెం బ్రేక్ పడింది. దీంతో మోడీ గ్యాస్ బాదుడు వాయిదా పడింది. సహజ వాయవు ధర రెట్టింపు చేయాలన్న గత యుపిఎ ప్రభుత్వ నిర్ణయాన్ని మూడు నెలల పాటు వాయిదా వేయాలని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది.

వివాదాస్పద ధరల నిర్ణాయక ఫార్ములా మరింత హితకరంగా మార్చేందుకు సమగ్ర సమీక్ష నిర్వహించాలని సిసిఇఎ నిర్ణయించింది. ప్రస్తుతం మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ గ్యాస్ ధర 4.2 డాలర్లను రెట్టింపు చేయాలని గతేడాది యుపిఎ నిర్ణయం తీసుకుంది. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి కొత్త ధర అమలు చేయాల్సి ఉండగా సెప్టెంబర్ నెల వరకూ వాయిదా వేస్తున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పటం జరిగింది.

gas-price

ధరల పెంపు నిర్ణయం గత ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలు చేయాల్సి ఉన్నా, సార్వత్రిక ఎన్నికలు రావడంతో వాయిదా పడింది.ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అన్ని వర్గాల వారితో చర్చించేందుకు మూడు నెలల పాటు కొత్త ధర ఫార్ములాను వాయిదా వేయాలని నిర్ణయించామని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles