Gujarati food items to be served in aeroplanes

Gujarati food items to be served in aeroplanes, narendra modi latest news, pm narendra modi latest news, gujarati food items to be served in aeroplanes, gujarati food items in aeroplanes, narendra modi speeches, narendra modi meetings, emirates airlines services, british airlines services, gujarati food items in airlines menu cards

Gujarati food items to be served in aeroplanes

గాలిలో ఎగురుతున్న మోదీ వంటకాలు

Posted: 06/23/2014 12:57 PM IST
Gujarati food items to be served in aeroplanes

(Image source from: Gujarati food items to be served in aeroplanes)

భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ హవా ఇప్పుడు ఆకాశానికి తాకింది. ఎన్నికల ముందు దేశం మొత్తం మీద ‘‘అబ్ కీ బార్ మోదీ సర్కార్’’ అంటూ ప్రతిఒక్కరు నినాదాలు చేసిన విషయం తెలిసిందే! గుజరాత్ రాష్ట్రంలో వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్న మోడీ ఇమేజ్.. ఒక్కసారిగా దేశం మొత్తం మీడి క్యాప్చర్ అయిపోయింది. బీజేపీ పార్టీలోనే వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడంతో... మోడీ ఒక బ్రాండ్ నేమ్ గా మారిపోయారు. ఆయన పేరు మీద గుజరాత్ రాష్ట్రంలో కొన్ని పుస్తకాలు, టీ షాపులు వంటి ఎన్నో అవతరించాయి. గుజరాత్ రాష్ట్రాన్ని అభివృద్ధిబాటపై నడిపిన మొదటి మంత్రిగా దేశం మొత్తం ఆయన పేరు ప్రచారాలు కొనసాగాయి. ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన తరువాత కూడా ఇతర దేశాల నాయకులు మోడీ పేరు మీద జేజేలు కొట్టడం మొదలుపెట్టేశారు.

ఇలా ఈ విధంగా కొనసాగిన మోడీ ప్రభంజనం... ఇప్పుడు తాజాగా ఆకానికి కూడా తాకింది. ప్రపంచంలోనే అతిపెద్ద విమానయాన సంస్థలయిన ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్, బ్రిటీష్ ఎయిర్ లైన్స్ వంటి మొత్తం 8 సంస్థలు... తమ మెను కార్డులలో గుజరాతీ రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ప్రత్యేక వంటకాలను చేర్చుకున్నాయి. గుజరాత్ రాష్ట్ర సంప్రదాయ వంటకం అయిన తాళీ, స్వీట్లు, ఇంకా రకరకాల వంటకాలను తమ విమానాలలో పొందుపరుస్తున్నట్టు ఆ సంస్థ యజమానులు పేర్కొన్నారు.

ఒక సాధారణ గుజరాతీ మనిషి అయిన నరేంద్రమోడీ... ఒక్కసారిగా ప్రధానమంత్రి స్థాయికి ఎదగడం ప్రపంచం మొత్తం మీద సంచలనాత్మకమైన రికార్డుగా మారిపోయింది. నలువైపులా వున్న మోడీ హవాను తాము కూడా వాడుకోవాలనే నేపథ్యంలోనే ఇటువంటి గుజరాతీ వంటకాలను విమానాలలో సర్వ్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. ఏదేమైనా... మోడీ గాలులు ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా ప్రవహించడాన్ని చూసి.... విదేశీ నాయకులు కూడా ఆశ్చర్యపోతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles