Cm kcr copying the schemes of chandrababu naidu

CM kcr copying the schemes of chandrababu naidu, cm kcr latest news, cm chandrababu naidu latest news, telugu political news, telangana state news, andhra pradesh state news, war between cm kcr and cm chandrababu naidu, kcr copying chandrababu schemes, cm kcr released new schemes for telangana government employees

CM kcr copying the schemes of chandrababu naidu

చంద్రబాబును కాపీ కొడుతున్న కేసీఆర్

Posted: 06/23/2014 10:38 AM IST
Cm kcr copying the schemes of chandrababu naidu

(Image source from: CM kcr copying the schemes of chandrababu naidu)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మరుక్షణమే ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ప్రకటించిన హామీలను పూర్తి చేస్తానన్న మాటప్రకారం... ఒకేరోజు ఐదు సంతకాలు చేసిపడేశారు. ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా ప్రతిఒక్క గ్రామానికి 20 లీటర్లు 2 రూపాయల చొప్పున నీటి సరఫరా పథకాన్ని అమలు చేస్తూ మొదటి దస్త్రంపై సంతకం చేశారు. అలాగే రైతుల రుణమాఫీలను మాఫీ చేస్తూ ఒక  సంతకం, వికలాంగులకు - వృద్ధులకు ఫించన్లు పెంచుతూ మరో సంతకం, బెల్టు షాపులను రద్దు చేస్తూ ఇంకొక దస్త్రంపై సంతకాలు చేశారు. ఇక చివరగా ప్రభుత్వ ఉద్యోగస్తుల పదవీ విరమణ కాలాన్ని 58 నుంచి 60 సంవత్సరాలకు పెంచుతూ ఐదో సంతకాన్నీ చేసిన విషయం అందరికీ తెలిసిందే! అలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం ఎయిర్ పోర్టు నిర్మాణాలు, మైక్రోసాఫ్ట్ కంపెనీల ఏర్పాటుకు కూడా సన్నద్ధమయ్యారు.

ఇదిలా వుండగా... తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణీస్వీకారం చేసిన కేసీఆర్ కూడా చంద్రబాబు నాయుడిని కాపీ కొడుతున్నట్టు కనిపిస్తోంది. రైతుల రుణమాఫీలపై ఇంతవరకు క్లారిటీ ఇవ్వకపోయినా... చంద్రబాబు నాయుడు ప్రవేశం పెట్టిన పథకాలలో ఒకటి కాపీ కొడుతూ.. ప్రభుత్వ ఉద్యోగస్తుల పదవీ విరమణ కాలాన్ని 58 నుంచి 60 ఏళ్లకు పెంచినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని చూసిన తెలంగాణ ఉద్యోగస్తులు... ఈమేరకు తమకు కూడా పదవీ విరమణ కాలాన్ని పెంచాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడిని తీసుకొచ్చిన తెలంగాణ ఉద్యోగస్తులు.. ‘‘ఎలాగైనా తమ సర్వీసును పెంచాల్సిందే’’నని పట్టుబడ్డారు. దీంతో సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం డైలామాలో పడిపోయారు. తెలంగాణ ఉద్యమాల్లో కూడా ఉద్యోగస్తులు కీలక పాత్రను పోషించిన ఉద్యోగస్తులకు పదవీ విరమణ కాలం పెంచడం సమంజసమేనని కొంతమంది మంత్రులు తమ వాదనలను తెలిపారు. అయితే వీటిపై కూడా కొన్ని విమర్శలు వెలువడ్డాయి. ఒకవేళ పదవీ విరమణ కాలాన్ని పెంచితే.. కొత్త ఉద్యోగస్తులకు నియమించడంలో సమయం ఎక్కువ అవుతుందని.... కొత్తవారికి ఉద్యోగ అవకాశాలు తక్కువవుతాయని మరికొంతమంది మంత్రులు తమ మనసులోని మాటలను వ్యక్తం చేశారు.

ఈ రెండు విధానాల మధ్య కొన్నాళ్లపాటు తీవ్ర ఆందోళనలో మునిగిపోయిన తెలంగాణ ప్రభుత్వం... చివరకు పదవీ విరమణ కాలాన్ని పెంచుతామని నిర్ణయం తీసేసుకున్నారు. ఈ పథకం ప్రకటన కూడా చాలా త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటిస్తూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles