First assembly sessions of ap starts at 11 52 on june 19

First AP Assembly sessions at 11.52 on June 19, Chandrababu fixes Muhurtham for first Assembly session, Chandrababu oath taking as per muhurtham, Speaker election on 20 June

First Assembly sessions of AP starts at 11.52 on June 19

నవ్యాంధ్ర తొలి శాసనసభకి 11.52 కి ముహూర్తం

Posted: 06/18/2014 06:50 PM IST
First assembly sessions of ap starts at 11 52 on june 19

వాస్తు, ముహూర్తాలకు ప్రాధాన్యతనిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారానికి సాయంత్రం 7.27 కి ముహూర్తం పెట్టించినట్లుగానే శాసనసభకు ఆరంభానికి కూడా ముహూర్తం పెట్టించారు.  అది జూన్ 19న ఉదయం 11.52 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ పాత శాసనసభ భవనంలో.

కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల ప్రమాణ స్వీకారాన్ని ప్రోటెమ్ సభాపతి పి నారాయణ స్వామి నిర్వహిస్తారు.  ఆ తర్వాత సభలో ఎమ్మెల్యేగా ఎన్నికై రెండు రోజుల క్రితం మృతి చెందిన నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావుకి నివాళులర్పించటం జరుగుతుంది.   ఆ తర్వాత సభ వాయిదా పడుతుంది.  

175 సభ్యుల ఆంధ్రప్రదేశ్ శాసన సభలో రెండు ఎమ్మెల్యే స్థానాలకు మళ్ళీ ఎన్నికలను నిర్వహించవలసివుంటుంది. ఒకటి రోడ్ ప్రమాదంలో ఏప్రిల్ 24 న మరణించిన ఆళ్ళగడ్డ నుంచి ఎన్నికల బరిలో ఉన్న వైయస్ ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి భూమా శోభా నాగిరెడ్డి స్థానంలోను, మరొకటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు స్థానానికి.  

20 వ తేదీన స్పీకర్, డెప్యూటీ స్పీకర్ల ఎన్నిక జరుగుతుంది.  21 న ఉదయం 8.55కి శాసనసభ, శాసనమండలి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ఉపన్యసిస్తారు.  

1200 మంది సిబ్బందితో శాసనసభ జరుగుతున్న సమయంలో గట్టి బందోబస్తు చెయ్యబడుతోంది.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles