Bjp leader shruti again in controversy house work women

shruti again in controversy, bjp leader shruti, Shruti, BJP leader, Bangalore, శోభతో శ్రుతి వివాదం

bjp leader shruti again in controversy house work women

ఇంటి పనిమనిషి శోభతో శ్రుతి వివాదం? కేసు

Posted: 06/19/2014 09:12 AM IST
Bjp leader shruti again in controversy house work women

నటి శ్రుతి పై పని మనిషి పగ పట్టి .. కేసు పెట్టి, తనకు రక్షణ కావలని పోలీసులను ఆశ్రయించింది. శ్రుతి ఇంటిలో పని చేస్తున్న శోభ అని పని మనిషి పోలీషు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. తనకు శ్రుతి నుండి ప్రాణ హానీ ఉందని చెప్పటంతో అందరు షాక్ తిన్నారు.

శ్రుతి అంటే కమల్ హాసన్ కూతురు శ్రుతి హాసన్ కాదులేండి. ఈమె బహుబాష నటి, బీజేపి శ్రుతి. తన ఇంటిలో పని చేస్తున్న శోభ కేసు పెట్టింది. శ్రుతి ఇంటిలో పని చేస్తున్న తనను.. ఇంటి, బెడ్‌రూం విషయాలు బయటకు చెబితే చంపేస్తామని బెదిరించేవారని చెప్పారు.

అయితే విషయం పై శ్రుతి మరోలా చెబుతుంది. నాలుగు సంవత్సరాలుగా శోభ తన ఇంటిలో పని చేస్తోందని, సొంత చెల్లెలు కంటే ఎక్కువగా ఆమెను చూసుకున్నానని నటి శ్రుతి చెప్పారు. చుట్టుపక్కల వాళ్లతో తన గురించి ఆమె చెడుగా చెప్పేదని తెలిపారు. దీనిపై మే ఒకటో తేదీన ఆమెను ప్రశ్నించానని, ఆ సమయంలో కార్యకర్తలు కూడా ఉన్నారని, ఎవరూ ఆమెపై దాడి చేయలేదని తెలిపారు. తనపై లేనిపోనివి ప్రచారం చేస్తుంటే ఎలా పనిలో పెట్టుకోవాలని ప్రశ్నించారు.

శోభ మాత్రం శ్రుతి పై ఘోరమైన ఆరోపణలు చేస్తుంది. మే ఒకటో తేదీన ఆమె అనుచరులు సతీష్, బాలు తనపై దాడి చేసినట్లు తెలిపారు. మే రెండవ తేదీ నుంచి అక్కడ పని మానేసినట్లు చెప్పారు. దీంతో వాళ్లు ప్రాంసరి నోట్‌పై బలవంతంగా తన వేలిముద్రలు తీసుకొని బెదిరిస్తున్నారని తెలిపారు. ప్రాణభయంతో ఇంతవరకు ఫిర్యాదు చేయలేకపోయానన్నారు. అయితే కేసు దర్యాప్తులోఉందని, పూర్తి వివరాలు ఇప్పుడే చెప్పలేమని పోలీసులు తెలిపారు.

పనిమనిషి శోభ తో.. బిజేపి నేత శ్రుతి పైట్ విషయం పార్టీలో తెలియటంలో ..పార్టీలో సీనియర్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. అధికారం వచ్చి నెల రోజులు కాకముందే..ఇలాంటి విషయాలు బయటపడితే.. కాంగ్రెస్ పార్టీకి, మన పార్టీకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయని ప్రజలు అనుకుంటారని పార్టీ నేతలు బాధపడుతున్నారు. అయితే శ్రుతి .. పనిమనిషి శోభ కేసు ఎంత వరకు వెలుతుందో చూద్దాం.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles