Minister venkaiah naidu vs mla kishan reddy

venkaiah naidu vs Kishan reddy, minister venkaiah naidu vs kishna reddy, Kishan Reddy Skips venkaiah Rally, bjp, Union minister Venkaiah Naidu.

minister venkaiah naidu vs MLA Kishan reddy, Kishan Reddy Skips Rally of Venkaiah Naidu

కిషన్ రెడ్డి వర్సెస్ వెంకయ్య నాయుడు!

Posted: 05/31/2014 05:35 PM IST
Minister venkaiah naidu vs mla kishan reddy

రాష్ట్ర అద్యక్షుడు .. కిషన్ రెడ్డి పిసినారి తనం మళ్లీ బయట పడింది. రాష్ట్రంలోని బిజేపి నాయకుల అందరితో.. కిషన్ రెడ్డికి విభేదాలు ఉన్నట్లు .. ఈరోజు బయటపడ్డాయి. సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయకు.. కిషన్ రెడ్డికి పడదని అందరికి తెలుసు. కానీ ఈ రోజు సీమాంద్ర చెందిన సీనియర్ నేత, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు హైదరాబాద్ కు వస్తున్న సందర్బంగా.. బిజేపీ నాయకులు, కార్యకర్తలు ఆనందంగా స్వాగతం పలికారు.

అయితే మన కిషన్ రెడ్డి మాత్రం వెంకయ్య నాయుడికి స్వాగతం చెప్పటానికి రాలేదు. కనీసం పార్టీ ఆఫిసు కూడా రాలేదని కార్యకర్తలు అంటున్నారు. దీంతో వెంకయ్య నాయుడి పై .. కిషన్ రెడ్డి కోపంగా ఉన్నాడని పార్టీలోని నేతలు అంటున్నారు.

రాష్ట్ర సీనియర్ నేతలు బండారు దత్తాత్రేయ, బంగారు లక్ష్మణ్, ఇంద్రసేనారెడ్డి తదితరులు వెంకయ్య వెంటే ఉన్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో వెంకయ్య ప్రసంగించారు. అయితే, ఈ కార్యక్రమానికి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గైర్హాజరయ్యారు.

minister-venkaiah-naidu-vs-MLA-Kishan-reddy

అయితే ఆయన వ్యక్తిగత పనుల మీద బెంగళూరు వెళ్లారని అభిమానులు చెబుతున్నారు. అయితే, రాష్ట్ర విభజన సమయంలోనే వెంకయ్యనాయుడు, కిషన్ రెడ్డిల మధ్య విభేదాలు మొలకెత్తాయనే వాదనలు కూడా ఉన్నాయి. ఈ విభేదాలే ఈనాటి కిషన్ రెడ్డి గైర్హాజరీకి కారణమని తెలుస్తోంది.

అయితే కిషన్ రెడ్డి మనసులో ఏముందో గానీ ఆయన మీద మాత్రం లేనిపోని పుకార్లు పార్టీలో పుడుతున్నాయి. వీటికి ఆయనే తెరదించాలి. సహజంగా వెంకయ్య నాయుడుకి ఎవరితో విభేదాలు లేవని పార్టీలోని సినియర్ నేతలు అంటున్నారు. కానీ కేంద్రమంత్రి హోదాలో తొలి సారిగా పార్టీలో ఆఫీసులో అడుగుపెట్టిన వెంకయ్యకు కిషన్ రెడ్డి స్వాగతం చెప్పకపోవటంతో అందరు ఆలోచిస్తున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles