Chandrababu naidu asks pm modi to ntpc power

Naidu asks PM Modi to ntpc power, chandrababu Naidu asks PM Modi, Telagana power, s Seemandhra CM on June 8, handrababu Naidu met Prime Minister, handrababu Naidu met Narendra modi.

chandrababu Naidu asks PM Modi to ntpc power, Chandrababu Naidu met Prime Minister Narendra Modi,

తెలంగాణకు కరెంట్ తగ్గించకండి: చంద్రబాబు

Posted: 05/31/2014 04:18 PM IST
Chandrababu naidu asks pm modi to ntpc power

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లితే చాలు.. ఇక్కడ తెలంగాణ నేతలు ఆవేశంతో ఊగిపోతున్నారు. చంద్రబాబు తెలంగాణ పై మరో కుట్ర చేస్తున్నాడని.. మీడియాలో గోల గోల చేస్తారు. కానీ బాబు ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు. అనే విషయం గురించి ఎవరు ఆలోచించరు. రాజధాని లేని రాజ్యానికి ముఖ్యమంత్రి అవుతున్న తరుణంలో కేంద్రంలోని పెద్దల సాయం చాలా అవసరం ఉంటుంది కాబట్టి, బాబు ఢిల్లీ వెళ్లుతున్నారు.

బాబు ఢిల్లీ ప్రయాణంపై..ప్రతిపక్ష నేతలు,రాజకీయ పార్టీలు, టీఆర్ఎస్ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. చంద్రబాబు వల్లే పోలవరం ఆర్డినెన్స్ వచ్చిందని, తెలంగాణ పై ఇంకా చంద్రబాబు విషం చిమ్ముతున్నాడని తెలంగాణ నేతలు ఆరోపిస్తున్నారు.

నిన్న ఢిల్లీకి వెళ్లిన బాబు .. బిజేపి నాయకులతో.. తెలంగాణ గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది. తెలంగాణ కు కరెంట్ తగ్గించకండని కేంద్రంలోని పెద్దలను కోరినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో మోడీ సహా 11 మంది కేంద్ర మంత్రులను కలిశానని... తమ డిమాండ్ల పట్ల అందరూ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని సమస్యల పరిష్కారానికి పలుమార్లు ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం ఉంటుందని చెప్పారు.

ఏపీకి తక్కువగా విద్యుత్ ను కేటాయించినందున ఎన్టీపీసీ నుంచి ఆ లోటును భర్తీ చేయాలని... తెలంగాణకు కేటాయించిన విద్యుత్ ను తగ్గించకుండానే సీమాంధ్రకు న్యాయం చేయాలని ప్రధాని మోడీని కోరినట్టు టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles