Kcr oath programme to be held at raj bhavan

KCR Telangana CM Oath Programme, June 2, Karne Prabhakar, KCR, oath program, Telangana, TRS, Raj Bhavan,

KCR Telangana CM Oath Programme to be Held at Raj Bhavan.

ప్రమాణ స్వీకారంలో కార్తకర్తలకు నో ఎంట్రీ

Posted: 05/31/2014 07:36 AM IST
Kcr oath programme to be held at raj bhavan

మొన్న ఢిల్లీలో నాలుగువేల మంది ప్రత్యేక అథిధుల మధ్య భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు.  వచ్చే నెల 8వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు దాదాపు 5 లక్షల మంది సమక్షంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కానీ తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించి, పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చి తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న కల్వకుంట్ల చంద్రశేఖ రావు మాత్రం చాలా సాధాసీదాగా, నిడారంబరంగా రాజ్ భవన్ లో సాదాగానే ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించుకోవడం విశేషం.

ఈ కార్యక్రమానికి కార్యకర్తలు రావద్దని పార్టీ వర్గాలు తెలిపాయి. కెసిఆర్ ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు ప్రమాణం చేయనున్నారు.  చంద్రబాబు సాయంత్రం ఏడున్నర కు చేస్తున్నారు. జూన్1, 2 తేధీల్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల్ని ఘనంగా నిర్వహించబోతున్నారు.  జూన్ 1 తేది అర్ధరాత్రి 12గం.లకు ట్యాంక్‌బండ్‌, నెక్లస్‌ రోడ్,  పీపుల్స్ ప్లాజాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు.

జూన్ 2న తెలంగాణలోని ప్రతి గ్రామంలో జాతీయ జెండాతోపాటు, టీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని టీఆర్‌ఎస్‌ నేత కర్నె ప్రభాకర్‌ అన్నారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడంతో కార్యకర్తల పాత్ర ఎంతో కీలకం. అలాంటిది తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న కేసీఆర్ కార్యకర్తల సమక్షంలో కాకుండా కొంత మంది టీఆర్ఎస్ నాయకుల సమక్షంలో చేయడం పై వారు గుర్రుగా ఉన్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles