Telangana employees deadlines

Telangana employees deadlines, Andhra Pradesh bifurcation, Telangana -employees, Telangana and Andhra,

Telangana employees deadlines

ఉద్యోగులకు సోమవారం ఉ.10 గం.లకు డెడ్ లైన్? ?

Posted: 05/31/2014 10:13 AM IST
Telangana employees deadlines

ఈరోజు అర్థరాత్రి నుండి తెలంగాణ ఉద్యోగులు విడుదలవుతున్నారు. తెలంగాణ ఉద్యోగులకు సోమవారం డెట్ లైన్ విదించారు. సోమవారం రాష్ట్ర విభజన నేపథ్యంలో వీలైనంత వరకు ఏ ప్రాంతానికి చెందిన ఉద్యోగులను ఆ ప్రాంతానికే కేటాయించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈరోజు అర్ధరాత్రి తెలంగాణ రాష్ట్ర సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో పని చేయాల్సిన ఉద్యోగుల జాబితాతో ఉత్తర్వులు జారీ చేయనున్నారు.

ఈ జాబితాలో లేని ఉద్యోగులంతా సీమాంధ్ర రాష్ట్రానికి పనిచేయాల్సి ఉంటుంది. ఉద్యోగుల కేటాయింపుల్లో అన్యాయం జరిగిందంటూ ఎవరూ న్యాయస్థానాలను ఆశ్రయించకుండా సెలవు రోజుల్లోనే ఉత్తర్వులు జారీ చేయాలని నిర్ణయించారు. ఈరోజు అర్ధరాత్రి తెలంగాణలో పనిసే ఉద్యోగుల పేర్లతో తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేస్తారు.

ఉద్యోగులు ఆ ఉత్తర్వులను చూసుకుని సోమవారం ఉదయం 10 గంటలకల్లా వారికి కేటాయించిన చోట రిపోర్ట్ చేయాలి. మిగిలిన వారు సీమాంధ్ర కార్యాలయాల్లో పనిచేయాలి. ఉద్యోగులు వారికి కేటాయించిన రాష్ట్రంలో చేరకపోయినా, సెలవుపై వెళ్లినా ఆ ఉద్యోగి పదోన్నతిని కోల్పతారు.

రెండో సారి ఇచ్చిన సమయంలోగా చేరకపోతే శాశ్వతంగా పదోన్నతిని కోల్పతారని సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.కె. సిన్హా ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేటాయింపుల్లో ఏమైనా అభ్యంతరాలుంటే సమస్యల పరిష్కార కమిటీకి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించనున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles