Maneka gandhi facebook page soon for complaints on women s

Women-s Facebook Page Soon, Gandhi-Facebook Page Soon, Maneka Gandhi-Facebook Page Soon, Complaints On Women-s, Women and Child Development Minister, Minister Maneka gandhi.

Maneka Gandhi-Facebook Page Soon, Maneka Gandhi-Facebook Page Soon For Complaints On Women-s

అమ్మాయిలకు మాత్రమే గాంధీ ఫేస్ బుక్!

Posted: 05/30/2014 11:30 AM IST
Maneka gandhi facebook page soon for complaints on women s

కేవలం అమ్మాయిలకు మాత్రం ఈ పేస్ బుక్ . కేంద్ర మంత్రి మేనకా గాంధీ మహిళల కోసం ప్రత్యేకంగా ఒక ఫేస్ బుక్ పేజ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. నేరాలు తగ్గించడానికి చర్యలు తీసుకోవడంతో పాటు బాధితులకు అండగా ఉంటామని అభయమిస్తున్నారు. ప్రత్యేక సెల్‌ ఏర్పాటుతో పాటు బాధితులు నేరుగా తమ సమస్యలు చెప్పుకోవడానికి ఫేస్‌బుక్‌ పేజ్‌ ఏర్పాటు చేస్తామంటోంది.

బాధితులతో నేరుగా అధికారులు ఆన్‌లైన్‌లో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటారు. ఒక్కసారి ఫిర్యాదు అందుకున్న తర్వాత కేసులో పురోగతిని ఎప్పటికప్పుడు తెలియజేస్తామంటున్నారు. నిర్భయ చట్టం అమల్లోకిచ్చినా మహిళలపై అత్యాచారాలకు అడ్డకట్ట పడడం లేదు. గృహహింస కేసులు పెరుగుతున్నాయి. చిన్న పిల్లలను కసాయి తండ్రులే కడతేర్చుతున్న ఘటనలున్నాయి.

అందుకే మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖను మరింత బలోపేతం చేయడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞనాన్ని వాడతామని మేనకా గాంధీ అంటున్నారు. సాధ్యమైనంత త్వరలోనే ఫేస్‌బుక్‌ పేజ్‌ రూపొందించి దేశ వ్యాప్తంగా మహిళలకు అందుబాటులో ఉంచుతామని కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మేనకా గాంధీ హామీ ఇస్తున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles