Narayana likely to be deputy cms for seemandhra

seemandhra cm chandrababu, seemandhra deputy cm narayana, two Deputy CMs Seemandhra, telugudesam party, tdp, Narayana likely to be Deputy CMs.

Narayana likely to be Deputy CMs for Seemandhra

సీమాంద్రలో బాబు తరువాత ఈయనే సీఎం?

Posted: 05/30/2014 10:33 AM IST
Narayana likely to be deputy cms for seemandhra

జూన్ 8 తేదీన సీమాంద్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నారా చంద్రబాబు నాయుడనే అనే విషయం అందరికి తెలుసు. కానీ సీమాంద్రలో బాబు తరువాత ఈయనే సీఎం అనే వార్తలు వినిపిస్తున్నాయి. సిఎం అంటే.. డిప్యూటీ సీఎం. ఎన్నికల సమయంలో బాబు ఆంద్రప్రదేశ్ కు ఇద్దరు డిప్యూటీ సీఎంలను నియమిస్తానని చెప్పిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఆయన డిప్యూటీల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో నారాయణ విద్యాసంస్థల అధినేత పి.నారాయణ పేరు ఒక్కసారిగా తెరమీదకు వచ్చింది. కాపు సామాజిక వర్గానికి చెందిన నారాయణ కూడా డిప్యూటీ రేసులో ఉన్నారని సమాచారం.

గత ఎన్నికల్లో నారాయణ పోటీ చేయనప్పటికీ... టీడీపీ తరపున ఉత్తరాంధ్ర జిల్లాల బాధ్యతను స్వీకరించారు. దీంతో, డిప్యూటీల లిస్టులో నారాయణ పేరును కూడా బాబు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని చంద్రబాబు సన్నిహితులు కూడా చూచాయగా అంగీకరిస్తున్నారు.

ఒక వేళ నారాయణ డిప్యూటీ సీఎంగా ఎంపికయితే ఆరు నెలల్లోగా ఎమ్మెల్యేగా గెలుపొందాల్సి ఉంటుంది. లేకపోతే ఆయనను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేసే అవకాశం కూడా ఉంది. అయితే ఈ విషయంపై సీమాంద్ర టిడిపి నాయకుల మద్య రగడ జరుగుతున్నట్లు సమాచారం.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles