Rail passengers robbed of gold jewellery in andhra pradesh

Rail passengers robbed, Rail passengers robbed of gold jewellery, Train passengers robbed, Robbery in Express.

Rail passengers robbed of gold jewellery in Andhra pradesh

రైళ్లలో చీకటి పనులు? భయంతో ప్రయాణికులు

Posted: 05/30/2014 01:20 PM IST
Rail passengers robbed of gold jewellery in andhra pradesh

మొన్నటి వరకు బస్సు ప్రమాదాలు , విమానాల హైజాక్ లతో ప్రయాణికులు భయంతో వణికిపోయారు. కానీ నేడు ప్రయాణికులను ఘోరంగా బయపెడుతున్నాయి రైల్వే ప్రయాణాలు. రైల్లో ప్రయాణం చేయాలంటే.. ప్రయాణికులు గజగజ వణికిపోతున్నారు. దీనికి కారణం రైళ్లలో జరుగుతున్న చీకటి పనులు. అంటే చీకట్లోనే దొంగలు దోచుకుంటారు. కానీ రైళ్లలో చీకటి లేదు , పగలు లేదు.. ఎప్పుడు పడితే అప్పుడు ప్రయాణికులను దోపిడి దొంగలు భారీ ఎత్తున్న దోచుకుంటున్నారు. దోపిడీ దొంగల అరాచకాలు మరింత మితి మీరిపోయాయి.

నిన్న గుంటూరు జిల్లా పిడుగురాళ్ల సమీపంలో చెన్నై ఎక్స్ ప్రెస్‌లో జగిరిన దోపిడీ ఘటన మరవకముందే తాజాగా అనంతపురం జిల్లాలోని గుత్తి రైల్వే స్టేషన్ సమీపంలో తిరుపతి-సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్ లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. ఎక్స్ ప్రెస్ రైలు తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్తోంది.

మార్గంమధ్యలో గుత్తి రైల్వే స్టేషన్ సమీపంలో దొంగలు S-6, S-7, S-8, S-9, S -10 బోగీల్లోని పలువురు మహిళల నుంచి భారీ మొత్తంలో బంగారపు నగలను అపహరించారు. రైలు ఉదయం 7.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకున్నాక రైలు లో ప్రయాణిస్తున్న ఉప్పల్ కు చెందిన భవాని జీఆర్ పి పోలీసులకు జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశారు.

తాను నిద్రపోతున్న సమయంలో గుత్తి వద్ద రైలును నిలిపి దుండగులు మెడలోని మూడు తులాల మంగళ సూత్రాన్ని లాక్కొని వెళ్లారని తెలిపారు.అయితే వారంలో ఇది మూడో సంఘటన కావడం గమనార్హం. కాగా వరుసుగా రైళ్లలో దోపిడీ జరుగుతుండడంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles