Film actor prakash raj fights with co passenger

Prakash Raj fights with co passenger, prakash raj calsh with passenger in flight, character actor, Actor Prakash Raj, RGI Airport.

film actor Prakash Raj fights with co passenger, prakash raj calsh with passenger in flight

విమానంలో పెంట పెంట చేసిన సినీ నటుడు?

Posted: 05/29/2014 08:33 AM IST
Film actor prakash raj fights with co passenger

సినీ నటుడు ప్రకాష్ రాజ్ తెరపైనే.. నటిస్తాడని అందరు అనుకుంటారు. ఆయన నిజ జీవితంలో కూడా నటిస్తారు. ఇప్పటికే నటుడు ప్రకాష్ రాజ్ పై టాలీవుడ్ లో రెండుసార్లు వివాదం అయ్యింది. అతని పై వేటు వేయటం కూడా జరిగింది. చివరకు సినీ పెద్దల సాయంతో.. మళ్లీ తెరపైకివచ్చాడు. అయితే చెన్నై వెళ్లే విమానంలో .. ప్రకాష్ రాజ్ పెంట పెంట చేశారు. దీంతో ప్రయాణికులు చాలా ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది.

అసలు ప్రకాశ్ రాజ్ చెన్నై విమానంలో ఏం చేసాడో తెలుసా? తోటి ప్రయాణికుడి చెంప పగలకొట్టి ..పెద్ద బీభత్సం స్రుష్టించారు. రాత్రి 7.30 గంటలకు ఆయన శంషాబాద్ అంతర్జాతీయ విమానంలో చెన్నై వెళ్లే ఎయిర్ ఇండియా విమానం ఎక్కారు. తన సీట్లో కూర్చున్న తర్వాత పక్కనే ఉన్న ప్రయాణికుడు ఫొటో తీశాడు. దీంతో ఆగ్రహం తెచ్చుకున్న ప్రకాశ్ రాజ్ .. అతని పై దాడి చేయటం జరిగింది. దీంతో ఈ ఇద్దరి మద్య తీవ్రమైన వాగ్వాదం చోటు చేసున్నట్లు సమాచారం.

అసలు ఇంతకీ ప్రకాశ్ రాజ్ పక్కన కూర్చున్న వ్యక్తి ఎవరో.. తోటి నటుడే. అతను జూనియర్ ఆర్టిస్ట్ అని ఎయిర్ లైన్స్ సిబ్బంది అంటున్నారు. ఈ ఇద్దరి మద్య గొడవ ముదిరిపోవటతో.. రంగంలోకి ఎయిర్ లైన్స్ సిబ్బంది దిగి ఇద్దరినీ శాంత పరిచారు. అయితే ఇద్దరు పోటా పోటీగా ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నట్లు సమాచారం. ఏమైన ప్రకాశ్ రాజ్ చర్యలతో.. టాలీవుడ్ పెద్దలు విసిగిపోయారనేది వాస్తవం. నిజంగానే ప్రకాష్ రాజ్ ఒక మొనార్కే అని మరోసారి గుర్తు చేశారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles