Pranab mukherjee signs on polavaram ordinance

President Pranab Mukherjee, Polavaram Ordinance, khammam, union cabinet,

Pranab Mukherjee signs on polavaram ordinance

పోలవరం పై ఆర్టినెన్స్ జారీ... కేసీఆర్ కి పంచ్

Posted: 05/28/2014 08:37 PM IST
Pranab mukherjee signs on polavaram ordinance

దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా చేపట్టిన ఖమ్మం జిల్లాలోని పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్డినెన్స్ పై ఫైలు పై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర వేవారు. .గతంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యుపిఎ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ ను అప్పట్లో రాష్ట్రపతి ఆమోదించలేదు.ఎన్నికల తర్వాత దీనిని బిజెపి మంత్రివర్గం కూడా ఆమోదం తెలపడంతో రాష్ట్రపతి అంగీకరించారు.

ఎన్డీఏ ప్రభుత్వం మంగళవారం నాటి కేబినెట్ భేటీలో ఆమోదించడం, ఆ తర్వాత రాష్ట్రపతికి పంపడం జరిగింది. ఈ ఆర్డినెన్స్ ద్వారా ఖమ్మం జిల్లాలోని చింతూరు, భద్రాచలం, కూనవరం, కుక్కునూరు, వేలేరుపాడు, బూర్కంపాడు, పీఆర్ పురం మండలాలు సీమాంధ్రలో కలవనున్నాయి.

పొలవరం ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలుపుతున్నామనే విషయాన్ని నిన్న కేంద్ర కేబినెట్ తరువార కూడా ఎవరూ వెల్లడించలేదు. కాగా దీనిపై టిఆర్ఎస్ నేత హరీష్ రావు మండిపడ్డారు.తెలంగాణ బిజెపి,టిడిపి నేతలను ప్రజలు నిలదీయాలని అన్నారు. పోలవరం పై ఆర్డినెన్స్ జారీ చేయడంతో కేసీఆర్ కి షాక్ తగిలినట్లు అయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles