Can under graduate smriti irani work as hrd minister

Under graduate Smriti Irani works as HRD Minister, Modi Cabinet Minister Smriti qualifications, 12th pass Smriti Irani as cabinet Minister, Smriti Inrani in Modi cabinet

Can under graduate Smriti Irani work as HRD Minister?

స్మృతి ఇరానీ విద్యార్హతలు మంత్రిపదవికి సరిపోతాయా?

Posted: 05/28/2014 04:19 PM IST
Can under graduate smriti irani work as hrd minister

అమేథీలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి పోటీగా భారతీయ జనతా పార్టీ తరఫున నిలబడి ఓడిపాయిన స్మృతి ఇరానీకి మంత్రి పదవినిచ్చిన మోదీ ప్రభుత్వం మీద జర్నలిస్ట్ మధు కిష్వర్ ట్విట్టర్లో ఘాటుగా స్పందించారు.  12 వ తరగతి చదివిన స్మృతి కేంద్ర మానవ వనరుల శాఖకు అర్హురాలు కాదని, నరేంద్ర మోదీ మరో యోగ్యతగలవారిని తన కేబినెట్ లో నియమించాలని ఆమె కోరారు.  ఇంకా లోతుగా తరచి చూస్తూ, స్మృతి ఇరానీ తన అఫిడవిట్ లో కరెస్పాండెన్స్ స్కూల్ నుంచి బి.కామ్ పార్ట్ 1 అని తన విద్యార్హతను ప్రకటించారని, నిజానికి అలాంటిదెక్కడా లేదని, అంటే అఫడివిట్ లో ఇచ్చిన సమాచారం తప్పని కూడా కిష్వర్ ఆరోపించారు.  

అయితే ఆ ట్విట్టర్ కి సమాధానంగా మరికొందరు ఇలా రాసారు- "రవీంద్రనాథ్ టాగూర్ ఏ యూనివర్సిటీకి వెళ్ళాడమ్మా?", అని ఒకామె అంటే, "కాంగ్రెస్ కి ఈ జాడ్యం పోదు.  ఆమె చేతల మీద మాట్లాడండి, ఆమె విధానాలమీద మాట్లాడండి కానీ స్మృతి ఇరానీ డిగ్రీ గురించి చర్చెందుకు, చదువుకున్న కపిల్ సిబాల్ ఏం ఒరగదీసాడని?" అని మరొకరు అన్నారు.  "స్మృతి ఇరానీ! ఇవేమీ పట్టించుకోకుండా ముందుకెళ్ళు.  చదువుకి అసలు అర్థమేమిటో తెలియజేయి- అది సంస్కారంతో వస్తుంది" అని మరో ట్వీట్ అంటోంది.  

ఒకవేళ చదువులు, డిగ్రీలే ముఖ్యమైతే, నజ్మా హఫ్తుల్లా గుండెకోశ వ్యాధుల నిపుణురాలైన వైద్య శాస్త్రంలో పిహెచ్ డి.  ఆమె మైనారిటీ వ్యవహారాల శాఖలో ఏం చేస్తోంది?  అరుణ్ జైట్లీ లా చదివారు.  ఎల్ఎల్ బి!  ఆయన ఆర్థిక శాఖలో ఏం చెయ్యగలరు? 

కొందరి అభిప్రాయంలో ఆమె మహిళ కాబట్టి అవకాశమిచ్చారని!  అయితే కేవలం ఛార్మ్ కోసం తీసుకునిరావటానికి టివి సీరియల్స్ లలో నటించి మెప్పించిన స్మృతి ఇరానీ అక్కడి నుంచి నేరుగా ఎన్నికలలోకి రాలేదు మిగతా స్టార్లలాగా!  ఆమె భాజపా లో పనిచేసి, మహారాష్ట్ర భాజపా యువ శాఖకు ఉపాధ్యక్షురాలిగా ఎదిగారు.  భాజపా మహిళా మోర్చ కి నాయకురాలిగా వ్యవహరించారు.  అంతేకానీ హేమా మాలిని, మూన్ మూన్ సేన్ లా గ్లామర్ తో వచ్చినావిడ కాదు! 

ఆ మాటకొస్తే నరేంద్ర మోదీ రాజకీయ శాస్త్రంలో ఎమ్ ఏ  చేసారు కానీ రాకెట్ సైన్స్ గురించి తెలియదే!  కానీ ఆయన స్పేస్ అండ్ అటామిక్ ఎనర్జీ శాఖను తీసుకున్నారు!  రాజ్ నాథ్ సింగ్ భౌతిక శాస్త్రంలో ఎమ్ఎస్ సి డిగ్రీ, హోం శాఖను నిర్వహించటానికి ఎందుకు పనికివస్తుంది?  ఆరో తరగతి చదివిన ఉమా భారతి గంగా ప్రక్షాళన ఎలా చేస్తుందని ఎవరూ అడగలేదు! 

ఆమె పనితో సంతుష్టి చెందవలసింది ఆమెను నియమించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోది మాత్రమే.  "ఎవరీ స్మృతి ఇరానీ?" అని ప్రియాంకా గాంధీ ఎన్నికల ప్రచార సమయంలో చేసిన వ్యాఖ్యకు, "ఆమె భారత దేశస్తురాలు.  అది చాలు!" అని ఉరుముతూ సమాధానమిచ్చారు మోదీ! 

మానవవనరుల శాఖలో పనిచేసి మెపించవలసింది స్మృతి ఇరానీ, ఆ పని సరిపోతుందా లేదా అని చూడవలసింది నరేంద్ర మోదీ.  అంతే కానీ ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను అడుగడుగునా ప్రశ్నించటం, వారి పనులను సందేహించటం సరికాదేమో!  వారికి తగు సమయాన్నిచ్చి వాళ్ళు చేసిన పనిని పరిశీలించి అప్పుడు వ్యాఖ్యానాలు చేస్తే బావుంటుందేమో!

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles