50 death anniversary of jawahar lal nehru

50 death anniversary of Jawahar Lal Nehru, Nehru fan saves 50 year old paper, Long served PM of India Nehru

50 death anniversary of Jawahar Lal Nehru

ఆ పేపర్ తో ఆయనకి 50 సంవత్సరాల అనుబంధం!

Posted: 05/28/2014 02:46 PM IST
50 death anniversary of jawahar lal nehru

ప్రింట్ చేసిన పేపర్లలో అతి దారుణంగా పాత పడేది వార్తా పత్రికే.  కొన్న పుస్తకాలు, మేగజైన్లను దాచుకుంటారు కానీ సామాన్యంగా వార్తా పత్రికలను ఎవరూ భద్రపరచరు.  ఎందుకంటే ఒక రోజు కూడా కాదు- చదవగానే విలువ పడిపోయేది ఒక్క దినపత్రికకే.  ఆ రోజు పేపర్ చదవకపోయినా సరే ఎవరైనా తాజా వార్తా పత్రికనే చదువుతారు. 

hanumantha-raoకానీ దానికి భిన్నంగా కోనసీమలో రాజోలు నివాసి, వృత్తి రీత్యా అడ్వకేట్ అయిన పొన్నాడ హనుమంతరావు 50 సంవత్సరాల క్రితం పేపర్ కి చెందిన రెండు కాపీలను భద్రంగా దాచివుంచారు.  అందుకు కారణం అందులోని జవహార్ లాల్ నెహ్రూ మరణించారన్న శిఖర వార్త.  ఆయన భారత ప్రథమ ప్రధాన మంత్రి పండిట్ జవహార్ లాల్ నెహ్రూ వీరాభిమాని, ఆ వార్తా పత్రిక (ద హిందూ) ని నిత్యం చదివే పాఠకుడు.  

సరే కానీ ఆయన ఆ ఒక్క వార్త కోసం రెండు కాపీల పేపర్ ని భద్రపరచుకున్నారా? 

అందులో దివంగత నేత సంపూర్ణ జీవిత చరిత్ర ఉంది.  దాన్ని అప్పుడప్పుడూ తీసి చదువుతుంటానన్నారు హనుమంతరావు.  ఆయన నివాసానికి ఆయన పెట్టుకున్న పేరు గాంధీ హౌస్.  అది రాజోలు ప్రధాన మార్గంలో ఉంది.  ఆయన భద్రపరచుకున్న వార్తా పత్రిక తేదీ మే 28 1964.  తానప్పుడు యవ్వనదశలో ఉన్న చిన్న అడ్వకేట్ నని, ఆ పేపర్లోని నెహ్రూ చనిపోయిన దుర్వార్త తనకు షాక్ నిచ్చిందని, ఆయన పోవటంతో ఒక యుగం సమాప్తమైన భావన కలిగిందని హనుమంతరావు అన్నారు.  

ఈ పేపర్ తో పాటు ఆయన భద్రపరచుకున్న మరో పేపర్ ఆంధ్ర ప్రదేశ్ అవతరణ సందర్భంగా వెలివడిన ప్రత్యేక సంచిక!  హనుమంత రావు తనకి ఇష్టమైన వార్తాపత్రికలు రెండని చెప్పారు.  ఒకటి హిందు, రెండవది అంతరించిపోయిన ఆంధ్ర పత్రిక.  ఇప్పటిలా డేటాను భద్రపరచుకునే వెసులుబాటు లేకపోయినా తనకున్న అభిమానంతో ఆసక్తితో 50 సంవత్సరాలు ఒక న్యూస్ పేపర్ హార్డ్ కాపీని జాగ్రత్తగా పదిలపరచుకోవటం విశేషమే.

అయితే, ఆ వార్తా పత్రికలోని జీవిత విశేషాలను చదవటం ద్వారా తన అభిమానాన్ని రెన్యూ చేసుకుంటున్న హనుమంతరావు ఆ విధంగా స్వతంత్ర భారత ప్రథమ ప్రధానికి ఇస్తున్న నివాళులు!

ఇంతవరకు అందరికంటే ఎక్కువ సంవత్సరాలు వరుసగా భారత ప్రధానిగా దేశాన్ని పాలించింది జవహార్ లాల్ మాత్రమే! స్వాతంత్ర్యం వచ్చిన రోజు- ఆగస్ట్ 15, 1947 నుంచి చనిపోయిన మే 27 1964 వరకు దాదాపు 17 సంవత్సరాల సుదీర్ఘకాలం పోటీ లేకుండా ప్రధానమంత్రిగా పనిచేసిన ఆయన రికార్డ్ ని ఇంతవరకు అధిగమించినవారు లేరు!

-శ్రీజ

(ఫోటో, కథనం 'ద హిందు' వార్తా పత్రిక సౌజన్యంతో)

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles