Car without steering and clutch brake and accelerator pedals

Car without steering and clutch, brake and accelerator pedals, Google driver less car. Google auto driven car

Car without steering and clutch, brake and accelerator pedals

స్టీరింగ్, క్లచ్, బ్రేక్, యాక్సిలరేటర్ లేని కారు!

Posted: 05/28/2014 05:54 PM IST
Car without steering and clutch brake and accelerator pedals

స్టీరింగ్, క్లచ్, బ్రేక్, యాక్సిలరేటర్ పెడల్స్ లేని కారుని గూగుల్ సంస్థ ఈ వారం ప్రదర్శనలో పెడుతూ, వాటి అవసరం లేదని, కేవలం అందులో కూర్చుని పుష్ బటన్ నొక్కితే చాలని చెప్తోంది.  

నాలుగు సంవత్సరాలుగా సెల్ఫ్ డ్రివెన్ కారు డిజైన్ ని తయారు చేస్తూ, అవసరమైనప్పుడు డ్రైవింగ్ బాధ్యతలను డ్రైవర్ కి అప్పజెప్పే విధంగా రూపొందించుదామనుకుని, ఇప్పుడు అసలు ఆ డ్రైవర్ కూడా లేకుండా ఉంటే పోలే అనుకుని ఆ దిశగా వాహన చోదకుడు లేని కారుని ప్రవేశపెడుతోంది.

ఈ కారు గురించి చెప్తూ, కార్ పార్కింగ్ కోసం చేసే 20 నిమిషాల వెతుకులాట సమయంలో మీరు మరో పని చూసుకుని రావొచ్చు.  కారు కీ జాగ్రత్తగా పెట్టుకోలేని సీనియర్ సిటిజన్లకు ఆ గొడవ తప్పుతుంది.  తాగి నడిపి యాక్సిడెంట్లు చెయ్యటమనేది ఇక ఉండబోదు.  అది చరిత్రగానే మిగిలిపోతుంది అంటోంది గూగుల్ సంస్థ.  ఈ వేసవిలో 100 ప్రోటో టైప్ కార్లను తయారు చేసి పరీక్షించి, ఆ తర్వాత వచ్చే రెండు సంవత్సరాలలో కాలిఫోర్నియాలో పైలట్ ప్రాజెక్ట్ ని తయారు చేస్తామని ఆ సంస్థ చెప్తోంది.  

ప్రస్తుతం రూపొందించిన కార్లు బ్యాటరీతో గంటకు 25 మైళ్ళ వేగంతో నడుస్తాయి.  కారుకి అన్ని వైపులా రెండు ఫుట్ బాల్ కోర్టులంత దూరం వరకు ఉన్న వస్తువులను సెన్స్ చేస్తాయట.  ప్రస్తతం ఇద్దరు కూర్చోవటానికి రెండు సీట్లతో సీట్ బెల్ట్ తో కేవలం స్టార్ట్ స్టాప్ బటన్లు మాత్రమే ఉన్నాయి.  ఇంకా తయారీలోనే ఉంది కాబట్టి ఎక్కువ సౌకర్యాలను పొందుపరచలేదు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles