Jagat prakash nadda to become bjp president

Jagat Prakash Nadda to become BJP President, Rajnath Singh takes Home Ministry, Nadda to take Party President position

Jagat Prakash Nadda to become BJP President

హోం తీసుకోబోతున్న రాజ్ నాథ్ సింగ్ స్థానంలో ఎవరు?

Posted: 05/24/2014 03:24 PM IST
Jagat prakash nadda to become bjp president

కాబోయే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సన్నిహితుడు,  భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్న జగత్ ప్రకాశ్ నడ్డా ఆ పార్టీ అధ్యక్ష పదవిని రాజ్ నాథ్ సింగ్ నుండి తీసుకుంటున్నారని సమాచారం.   రాజ్ నాథ్ సింగ్ హోం శాఖను తీసుకోబోతున్నారన్న వార్తతో పాటు ఆయన ఇంతకాలం మోసిన పార్టీ అధ్యక్ష పదవిని నడ్డాకి అప్పగిస్తారని కూడా వార్తలు వినవస్తున్నాయి.  నడ్డా రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ లో మోదీ జనరల్ సెక్రటరీగా పనిచేసినప్పుడు నడ్డా ఆయన దగ్గర పనిచేసారని, ఆర్ఎస్ఎస్ మద్దతు కూడా ఆయనకు ఉందని తెలుస్తోంది.  

ఢిల్లీ చాణక్యపురిలోని గుజరాత్ భవన్ లో రాజ్ నాథ్ సింగ్ తో ఈ విషయంలో భేటీ అవటానికి నడ్డాతో పాటు అమిత్ షా, ఉమా భారతి కూడా వెళ్ళారు.  

రాజకీయాలలో పూర్వానుభవం ఉన్న నడ్డా హిమాచల్ ప్రదేశ్ లో 1998 నుంచి 2003 వరకు క్యాబినెట్ లో ఎన్విరాన్ మెంట్ మినిస్టర్ గా పనిచేసారు.  ఆ తర్వాత 2008 నుంచి 2010 వరకు అదే హోదాలో కొనసాగారు.  ఆ తర్వాత 2010 నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles