Kejriwal open letter to aap volunteers

Kejriwal open letter to AAP volunteers, AAP plans to circulate open letter, AAP volunteers to explain to people about Kejriwal, Kejriwal in Tihar jail

Kejriwal open letter to AAP volunteers

నేను జైల్లో, గడ్కరీ బయటా- కేజ్రీవాల్

Posted: 05/24/2014 02:34 PM IST
Kejriwal open letter to aap volunteers

బెయిల్ బాండ్ ఇవ్వటానికి అంగీకరించకుండా తిహార్ జైల్లో గడపటానికే సిద్ధపడ్డ ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తను జైలుకి వెళ్ళటానికే ఎందుకు నిర్ణయించుకున్నారో వెల్లడిస్తూ ఓపెన్ లెటర్ రాసారు.

మాజీ భాజపా అధ్యక్షుడు నితిని గడ్కరీ అవినీతిని నేను ఎండగట్టాను.  అయితే ఆయనేమో బయట హాయిగా తిరుగుతున్నాడు, నేను జైల్లో ఉన్నాను.  నన్ను బెయిల్ తీసుకోమని అంటున్నారు.  అసలు నేనేం అపరాధం చేసాను. అంటూ రాసిన ఓపెన్ లెటర్ కింది ఖైదీ నం.3642, జైల్ నం.4, తిహార్ అని రాసారాయన.  

ఎన్నికల్లో ఓడిపోయినా, తిరిగి రాజకీయాల్లోకి రావటానికి, జైల్లో ఉండి సానుభూతిని సంపాదించటానికి బాగా ఉపయోగపడుతుందని రాజకీయ నాయకులకు అర్థమైనా, 10000 రూపాయల బాండ్ ఇవ్వటానికి కేజ్రీవాల్ కి అభ్యంతరమేమిటన్నది మేజిస్ట్రేట్ కి అర్థం కాలేదు.  

అవినీతికి ఎదురొడ్డి చేసిన పోరాటంలో తాను ఆకలిదప్పులకు, పోలీసు దెబ్బలు, అవమానాలు ఓర్చుకున్నానని, ఇప్పుడు జైల్ లో కూడా ఉండవలసివచ్చిందని అన్నారు కేజ్రీవాల్.  ఇప్పుడు మీరే నాకు అండ.  నాకోసం ప్రార్ధన చెయ్యండి అని కేజ్రీవాల్ ఆ లేఖలో రాసారు.  

నా మీద ఎన్నో పరువు నష్టం దావాలు వేసారు కానీ ఇంతవరకు బెయిల్ తీసుకోమని ఎవరూ అనలేదు.  నా తప్పేమీ లేదు కాబట్టి నన్ను వదిలిపెడతారనే అనుకున్నా కానీ ఇలా బెయిల్ కి బదులు జైల్ కి వెళ్ళవలసి వస్తుందని అనుకోలేదు.  నేను ఇలా తిహార్ జైల్లో ఉంటే, అవినీతిని ఎదుర్కోవటానికి సామాన్యమానవుడు ఎలా పోరాడగలడని అనిపిస్తోందని కూడా కేజ్రీవాల్ రాసారు.  

వాలంటీర్ల ద్వారా ఈ ఉత్తరం నకలు తీసి ఏ పరిస్థితుల్లో కేజ్రీవాల్ జైలుకి వెళ్ళారన్నది ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నం చేస్తోంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles