War room started in telangana bhawan

War room started in Telangana Bhawan, Chandrababu questions purpose of war room, Babu says Telangana people want peace but not war rooms, Srinivas Gowd and Swamy gowd open Telangana bhawan war room

War room started in Telangana Bhawan

తెలంగాణా భవన్ లో వార్ రూం-ఎందుకన్న బాబు

Posted: 05/24/2014 03:52 PM IST
War room started in telangana bhawan

తెలంగాణా భవన్ లో తెలంగాణా రాష్ట్ర సమతి పార్టీ నాయకులు స్వామి గౌడ్, శ్రీనివాస గౌడ్ వార్ రూం ని ప్రారంభించారు.

వార్ రూం ఎందుకు, ఎవరితో యుద్ధాలు చెయ్యటానికి అని తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు విమర్శించారు.  తెలంగాణా ప్రజలు కోరుకునేది ప్రశాంతత, అభివృద్ధి అని, వాళ్ళకి కావలసింది వార్ రూం లు కాదని అన్నారాయన.

చంద్రబాబు మాటలకు సమాధానంగా, వార్ రూం పెట్టింది యుద్ధాలు చెయ్యటానికి కాదని, రాష్ట్ర అభివృద్ధి కోసమని, ఎవరి రాష్ట్రాన్ని వారు అభివృద్ధి చేసుకుందామని స్వామిగౌడ్ అన్నారు.  ఆంధ్ర ప్రాంతంలో ఉన్న తెలంగాణా ఉద్యోగులను వెంటనే రప్పించాలని డిమాండ్ చేసారాయన. 

శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, సమాచారం సేకరించటానికి ఉన్నదే వార్ రూం అని, ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని చెడగొట్టవద్దని, విద్వేషాలు రేగేట్టుగా మాట్లాడుతున్నదెవరో తెలుసుకుని మాట్లాడమని అన్నారు.  ఏ రాష్ట్ర ఉద్యోగులు ఆ రాష్ట్ర సచివాలయంలో పనిచెయ్యాలని ఆయన అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles