Jayalalithaa miffed at modi for inviting lanka president

Narendra modi, PM Narendra modi, Jayalalithaa miffed at Modi, Jayalalithaa vs narendra modi, Narendra Modi for inviting Sri Lakan president, Sri Lakan president Mahindra Rajapaksa, Tamil Nadu Chief Minister Jayalalithaa, AIADMK, BJP.

Jayalalithaa miffed at Modi for inviting Lanka president, Jayalalithaa is unhappy with Narendra Modi,

అయ్యో..! వివాదంలో చిక్కిన మోడీ..!

Posted: 05/23/2014 08:02 AM IST
Jayalalithaa miffed at modi for inviting lanka president

నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం దగ్గరపడుతున్న కొద్ది.. కొత్త కొత్త వివాదాలు తెరపైకి వస్తున్నాయి. మిత్రపక్షలుగా ఉన్న వారే మోడీ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దేశ ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారానికి మునుపెన్నడూ లేని విధంగా సార్క్ దేశాధినేతలను ఆహ్వానించారు. ఇప్పటికే కొన్ని దేశాల అధిపతులు మోడీ ఆహ్వానాన్ని మన్నించి, ప్రమాణస్వీకారానికి హాజరవుతున్నట్టు ప్రకటించారు.

శ్రీలంక అధ్యక్షుడు మహీంద్ర రాజపక్సే కూడా వస్తున్నట్టు ప్రకటించారు. ఇదే తాజా వివాదానికి తెరతీసింది. శ్రీలంక నేత రావడం తమకెంత మాత్రం ఇష్టం లేదని తమిళ పార్టీలు గట్టిగా చెబుతున్నాయి. మోడీ ప్రమాణ స్వీకారానికి శ్రీలంక అధ్యక్షుడు రావడం తమిళుల మనోభావాలను తీవ్రంగా గాయపరుస్తుందని ఎండిఎంకె పార్టీ నేత వైగో బాహాటంగానే ప్రకటించారు.

ఎల్ టిటిఈ పై శ్రీలంక ప్రభుత్వం దాడులు జరిపిన సమయంలో వేలాది మంది తమిళులు ఊచకోతకు గురయ్యారని, అందుకు రాజపక్సే ప్రత్యక్షంగా బాధ్యుడని వైగో అంటున్నారు. శ్రీలంక ప్రభుత్వానికి బాసటగా నిలిచిన కాంగ్రెస్ కు తమిళ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. సార్క్ దేశాలన్నింటికీ పంపిన ఆహ్వానంలో భాగంగానే శ్రీలంకనూ ఆహ్వానించామన్న బీజేపీ వాదనను తమిళ పక్షాలు అంగీకరించే స్థితిలో లేవు.

అయినా ప్రధాని కాకముందే వివాదాల్లో పడితే ఎలా మోడీ అని.. పార్టీలోని సీనియర్లు అంటున్నారు. కానీ మోడీ మోడ్రన్ స్టైల్ వేరులే అని కొంత మంది అంటున్నారు. మోడీ హవా ఏమిటో ఒకసారి ప్రపంచానికి తెలిసే విధంగా నరేంద్ర మోడీ ముందుకు పోతున్నారని.. ఆయన సన్నిహితులు అంటున్నారు.

గతంలో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రమాణస్వీకారోత్సవానికి కూడా శ్రీలంకను ఆహ్వానించలేదన్న విషయాన్ని వైగో గుర్తు చేస్తున్నారు. మరి వైగో విన్నపాలను మన్నిస్తారో, బుజ్జగిస్తారో లేక నమో మంత్రం వేస్తారో చూద్దాం.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles