Seniors in modi s cabinet

Seniors in Modi's Cabinet, BJP senior leaders in Modi's cabinet, Modi swearing in on 26th, Modi prefers small Government

Seniors in Modi's Cabinet

మోదీ క్యాబినెట్ ఎలా ఉండబోతోంది?

Posted: 05/22/2014 05:39 PM IST
Seniors in modi s cabinet

తాను స్వయంగా నిబద్ధతతో నడుస్తూ, ఛండశాసనుడిలా పనిచేసే నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా 26 న ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.  ఈ లోపులో మంత్రి వర్గాన్ని నిర్ణయిస్తే వాళ్ళు కూడా ఆరోజు ప్రమాణ స్వీకారం చెయ్యగలుగుతారు కాబట్టి భాజపా ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చివుండాలి.  అయితే మంత్రులను ఎక్కువ సంఖ్యలో నియమించకుండా పరిమితమైన సంఖ్యలో ఉంచితేనే వాళ్ళతో కలిసి ప్రభుత్వాన్ని నడపటంలో సౌలభ్యం ఉంటుందని మోదీ భావిస్తున్నట్లుగా సమాచారం.  అయితే ప్రధానమైనవారికి తప్పనిసరిగా మంత్రివర్గంలో చోటు ఇవ్వాల్సి కూడా వస్తుంది.  

modi-cabinet-1ముందుగా పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ విషయానికి వస్తే ఆయన మూడు విధాలుగా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.  పార్టీ అధ్యక్షుడిగా కొనసాగటమా లేక హౌమ్ శాఖ కానీ, లేదంటే రక్షణ శాఖ తీసుకోవటమా అన్నది తేల్చుకోలేకపోతున్నారు.

modi-cabinet-2అత్యంత సీనియర్ నాయకుడు అద్వానీ లోక్ సభ స్పీకర్ గా వ్యవహరించటానికి అంగీకరించారు.

modi-cabinet-3అమృత్ సర్ లో పోటీచేసి ఓడిపోయిన సీనియర్ నాయకుడు అరుణ్ జైట్లీకి ఆర్థిక శాఖను ఇచ్చే అవకాశం ఉంది.

modi-cabinet-4వాజ్ పాయ్ ప్రభుత్వంలో మానవవనరుల శాఖను తీసుకున్న మురళీ మనోహర్ జోషి ప్లానింగ్ కమిషన్ కి డెప్యూటీ ఛైర్మన్ గా బాధ్యతలు అప్పగించనున్నారు.  

modi-cabinet-5రవిశంకర్ ప్రసాద్ న్యాయ శాఖా మాత్యులుగా పనిచెయ్యవచ్చు.

modi-cabinet-615 వ లోక్ సభలో ప్రతిపక్షనాయకురాలిగా వ్యవహరించి అందరి మన్ననలందుకున్న సుష్మా స్వరాజ్ విదేశాంగ శాఖను చేపట్టవచ్చు.

ఇవీ సీనియర్ నాయకుల పోర్ట్ ఫోలియోస్.  ఇక మిగిలిన నాయకులు, ఎన్డియే కూటమిలోని వారికి ఏమేం పదవులు కట్టబెట్టబోతున్నారన్నది ముందుగా భాజపా సీనియర్ నాయకుల విషయంలో నిర్ణయానికి వచ్చిన తర్వాత తెలుస్తుంది.  ఆంధ్రప్రదేశ్ నుంచి గెలిచిన తెదేపా భాజపా ఎంపీలకు కూడా సముచిత స్థానం లభిస్తుందని సమాచారం.  

-శీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles