Gold trade will raise wgc hopeful

Gold trade will raise WGC hopeful, Indian Gold import policy, Gold imports down with raise in import duty, Import curbs brought down gold purchases in India

Gold trade will raise WGC hopeful

పెరుగనున్నబంగారం క్రయవిక్రయాలు?

Posted: 05/20/2014 04:42 PM IST
Gold trade will raise wgc hopeful

కొత్త ప్రభుత్వం బంగారం దిగుమతుల మీద సుంకాన్ని తగ్గించే ఆలోచనలో ఉండటంతో ఈ సంవత్సరం మధ్యలో దేశంలో బంగారం క్రయవిక్రయాలు పెరగనున్నాయి.   ఈ విషయాన్ని వర్ల్ డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యుజిసి) వెల్లడిచేసింది.  

మోదీ ప్రభుత్వం బంగారం దిగుమతుల మీద ఆంక్షలను సడలించే యోజనతో ఉన్నదన్న సంకేతం అందిన డబ్ల్యుజిసి ఈశాన్య దేశాల ప్రధానాధికారి ఆల్బెర్ట్ చెంగ్ నరేంద్ర మోదీ బంగారం విషయంలో మద్దతును తప్పక ఇస్తారని తెలిసిందని, ఆయన అధికారంలోకి వచ్చి ఆ పని ఎప్పుడు చేస్తారా అని ఎదురు చూస్తున్నామని అన్నారు.

ప్రపంచ స్థాయిలో బంగారం దిగుమతిలో చైనా తర్వాత రెండవ స్థానాన్ని ఆక్రమించిన భారత దేశం 2013లో చరిత్రలో మొదటిసారిగా అమాంతం పెంచేసిన దిగుమతి సుంకం వలన బంగారం ధర ప్రపంచ మార్కెట్ లో 28 శాతం పడిపోయింది.  రెండవ స్థానంలో ఉండే భారతదేశం నాల్గవ స్థానానికి పడిపోయింది.  

రాబోయే భాజపా ప్రభుత్వం బంగారం దిగుమతి పాలసీని పునపరిశీలన చేసినట్లయితే,  నెలకి 50 నుంచి 60 టన్నుల వరకు విక్రయాలు జరుగుతాయని ఆశాభావాన్ని వెలిబుచ్చారు.

జూలై 2013 కి ముందు బంగారం దిగుమతులు సగటున 78 టన్నులుంటే ఆ తర్వాత అది కాస్తా 24.69 టన్నలకు పడిపోయిందని జిఎఫ్ ఎమ్ఎస్ మెటల్ కన్సల్టెన్సీలో పనిచేసే మెటల్ ఎనలిస్ట్ సుదీశ్ నంబియాత్ అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles