Narendra modi speech in parliament

Narendra Modi speech in Parliament, Narendra Modi elected as Parliamentary leader, Modi speaks in Parliament emotionally, Modi emotional speech in Parliament

Narendra Modi speech in Parliament

దేశం కోసం చచ్చే అవకాశం లేదు బ్రతికుండి కాపాడుకుందాం!

Posted: 05/20/2014 02:19 PM IST
Narendra modi speech in parliament

నా మాతృభూమి నా కన్నతల్లి.  తల్లికి సేవచెయ్యటం నా విధి, నాకర్తవ్యం,  అందులో నేను చూపించే జాలి దయలు ఏమీ లేవు.  ఇంకా నా పార్టీ దయచూపిస్తోంది కానీ నేను కాదు అన్నారు నరేంద్ర మోదీ ఈ రోజు పార్లమెంటులో ఆయనను ఏకగ్రీవంగా నాయకుడిగా ఎన్నుకున్న సందర్భంగా.   ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీకు సదా ఋణపడివుంటాను అని కూడా ఆయన అన్నారు.

ఒక నిరుపేద మీ ముందు ఇక్కడ ఇలా నిలబడి వున్నాడు.  ఇదీ ప్రజాస్వామ్యంలో ఉన్న శక్తి అన్నారు మోదీ.  

ఏప్రిల్ 10 న ఎన్నికల ప్రచారం అయిపోయిన సందర్భంగా విధేయుడైన ఒక సైనికుడిలా నేను పార్టీ అధ్యక్షుడిని కలిసి నా నివేదికను సమర్పించాను.  నాకిచ్చిన బాధ్యతను నెరవేర్చటంలో నేను ఒక నిమిషాన్ని కూడా వృధా చెయ్యలేదు అన్నారు మోదీ.  

ఇది ప్రజాస్వామ్యం.  ఇది ఒక కోవెల.  ఇక్కడ హోదాలు ముఖ్యం కాదు.  సేవాతత్పరతే ప్రధానం.  125 కోట్ల భారత ప్రజానీక సంక్షేమమే అన్నిటికన్నా ప్రధానం అన్నారు మోదీ.  

దేశాన్ని అభ్యుదయంలో నడిపిస్తామన్న ఆశాభావం ప్రజల్లో అప్పుడే మొదలైంది.  దాన్ని మేము నిలబెట్టుకుంటాం.  నిరాశకు తావివ్వకండని దేశవాసులను సంబోధిస్తూ అన్న మోదీ, నేను ఆశావాదిని, ఒక ఆశావాది మాత్రమే దేశ ప్రజలలో ఆశాభావాన్ని మొలకెత్తేట్టుగా చెయ్యగలుగుతాడు అని చెప్పుకున్నారు.  నేను మిమ్మల్ని నిరాశపరచను.  నా మీద మీరు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చెయ్యను అని మోదీ హామీ ఇచ్చారు.  

దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలనర్పించే అవకాశం మనకు లేదు.  కానీ బ్రతికి వుండి భారతదేశ స్వాతంత్రాన్ని కాపాడుకోవటానికి అవకాశం ఉంది అన్నారు మోదీ.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles