Bjp clean sweep irks many parties

BJP clean sweep irks many parties, Modi wave in elections 2014, SP BSP JD U in introversion

BJP clean sweep irks many parties

అంతర్మథనంలో పడేసిన భాజపా విజయం

Posted: 05/20/2014 05:59 PM IST
Bjp clean sweep irks many parties

హేమాహేమీలు అనుకున్న పార్టీలన్నీ భారతీయ జనతా పార్టీ విజయంతో అంతర్మధనంలో పడి ఆత్మపరిశీలన చేసుకుని కొన్ని రాజీనామాలు మరి కొన్ని పదవులనుంచి తొలగించటాలు చేసాయి.  

కాంగ్రెస్ పార్టీలో హైడ్రామా నడిస్తే, అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గోగోయ్, బీహార్ ముఖ్యమంత్రి నితిశ్ కుమార్ తమ పదవులకు రాజీనామా చేసారు.  ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తానుగా రాజీనామా చెయ్యలేదు కానీ, 36 మందిని మంత్రిస్థాయి హోదాలో ఉన్నవారిని పదవులనుంచి తొలగించివేసారు.  వారిలో ఆరుగురు మైనార్టీ వర్గంవారు కూడా ఉన్నారు.  ఇంకా కొందరు క్యాబినెట్, రాష్ట్ర మంత్రుల మీద కూడా వేటు పడవచ్చని తెలుస్తోంది.  

బిఎస్పీ నాయకురాలు మాయావతి తన పార్టీ కేంద్రాలను మూసివేసారు.  ఒకప్పుడు 20 పార్లమెంటు సభ్యులున్న ఆ పార్టీ ఈసారి ఎన్నికలలో అసలు ఖాతాయే తెరవలేదు.  భాజపా, భాజపాతో ఎన్నికల పొత్తులో పోటీ చేసిన అప్నా దళ్ 73 సీట్లను సంపాదించగా కాంగ్రెస్ కేవలం రెండు స్థానాలను గెలుచుకుంది.  

కేవలం పంజాబ్ లో నాలుగు స్థానాలను గెలుచుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వాహకుడు అరవింద్ కేజ్రీవాల్ ఎలాగూ సోదిలో లేకుండా పోయారు.   

'దట్సీజ్ మోదీ' అనిపించిన ఈ సార్వత్రిక ఎన్నికలను రాష్ట్రపతి కూడా ఈరోజు ప్రశంసించారు.  ఈ నెల 26న నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం సాయంత్రం 6 గంటలకు జరపటానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంగీకరించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles