Trs to work with nda and tdp

TRS to work with NDA, TRS expects reciprocal support from NDA, TRS will work with TDP says KTR, Telangana need special status KTR Says

TRS to work with NDA and TDP in the best interests of Telangana people

ఎన్డియేకి సహకరిస్తాం, అటు నుంచీ అదే కోరుకుంటున్నాం !

Posted: 05/20/2014 11:14 AM IST
Trs to work with nda and tdp

తెలంగాణా రాష్ట్ర సమితి ఎన్డియేకి మద్దతునిస్తుందని, అయితే అందుకు ప్రతిగా అదే విధమైన స్పందనను కేంద్రం నుంచి ఆశిస్తున్నామని తెరాస ఎమ్మల్యే కెటిఆర్ అన్నారు.  నాలుగు కోట్ల తెలంగాణా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతతో ఉంటామని ఆయన అన్నారు.  

ఐదు సంవత్సరాల వరకు ప్రజలు కేంద్రంలో వాళ్ళకూ రాష్ట్రంలో తమకీ పట్టం కట్టారని, అందువలన కేంద్ర ప్రభుత్వంతో సంపూర్ణ సహాయ సహకారాలతో మెలుగుతామని అన్న కెటిఆర్,  రాజకీయంగా సిద్ధాంత పరంగా ఏమైనా విభేదాలున్నా, అవేమీ ప్రభుత్వాన్ని నడపటంలో అడ్డురావని అన్నారు.  

మేమూ సహకారాన్ని అందిస్తాం, కేంద్రం నుంచి కూడా అదేవిధంగా ఆశిస్తామని అన్న కెటిఆర్, కేవలం సీమాంధ్రకే ప్రత్యేక ప్యాకేజ్, ప్రత్యేక హోదాను కట్టబెట్టిన యుపిఏ ప్రభుత్వాన్ని తప్పు పడుతూ, తెలంగాణాకు కూడా అటువంటి ప్రత్యేక హోదాను కల్పించవలసిందిగా ఎన్డియే ప్రభుత్వాన్ని కోరుతామని అన్నారు.  

అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలసి పనిచెయ్యటంలో కూడా తెరాసకు ఎటువంటి అభ్యంతరాలూ ఉండవని, ఈ ప్రాంత ప్రజలు తెరాసకి పట్టం కట్టినట్లే సీమాంధ్ర ప్రాంత ప్రజలు తెదేపాకి పట్టం కట్టారని కెటిఆర్ అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles