Employees distribution in to two states kept pending

Employees distribution in to two divided states, Employees distribution kept pending, Complete directives for employees distribution

Employees distribution in to two states kept pending

ఉద్యోగుల విభజన సమస్య కానుందా?

Posted: 05/20/2014 12:05 PM IST
Employees distribution in to two states kept pending

రాష్ట్ర విభజన దృష్ట్యా ఉద్యోగుల విభజన విషయంలో హోం వర్క్ చేసిన కేంద్ర డివోపిటి అధికారుల సూచనలు అసమగ్రంగా ఉన్నాయని కమిటీ ఛైర్మన్ కమలనాధన్, పునర్విభజన విభాగ ముఖ్య కార్యదర్శి పివి రమేష్ వాటిని సమ్మతించలేదు.  

గతంలో మూడు రాష్ట్రాలలో జరిగిన విభజనను పరిగణనలోకి తీసుకుని కొన్ని మార్గదర్శకాలను రాష్ట్రానికి పంపించటం జరిగింది. అయితే అవి సమగ్రంగా లేవని, మార్గదర్శకాలను మార్చాలని, అవి సమగ్రంగా లేవని, త్వరలో మార్గదర్శకాలను రూపొందించి పంపించవలసిందిగా ప్రధాన కార్యదర్శి P K మొహంతి ఈ రోజు ఢిల్లీలో డివిపిటి అధికారులతో భేటీలో చెప్పనున్నారు.  అఖిల భారత సర్వీసుల విభజనకు సంబంధించిన విషయాల మీద కూడా మొహంతి  ప్రత్యూష్ సిన్హాతో చర్చించనున్నారు.  

సమగ్రమైన మార్గదర్శకాలు వచ్చిన తర్వాతనే విభజన ప్రక్రియను ప్రారంభించాలని, ముందుగా స్థానికత, చదువునిబట్టి ఉద్యోగుల పంపిణీ చేసి ఆ తర్వాత కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత వారి సూచనల మేరకు ఉద్యోగుల విభజనను పూర్తిస్థాయిలో చేపట్టాలని నిర్ణయించటం జరిగింది.  అఖిలభారత సర్వీసులలో పనిచేసేవారి ఆప్షన్ల విషయంలో కూడా మొహంతీ ప్రత్యూష్ సిన్హాతో చర్చించనున్నారు.

రాష్ట్ర విభజన జరిగి ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఉద్యోగుల పంపిణీ సమస్యగా మారే అవకాశం ఎక్కువగా ఉంది.  ఎందుకంటే ఇరు ప్రాంతాల ప్రజా ప్రతినిధులు తమ తమ పట్టుని విడవకుండా ఉద్యోగుల పంపిణీ విషయంలో భేదాభిప్రాయాలను ప్రకటించే అవకాశం ఉంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles