Cbi refuses to file case on cbi special court orders

CBI refuses to file case on CBI special court orders, HC SC Central Govt orders acceptable to CBI, CBI SP ordered case on KCR, special court orders not to be carried out by CBI

CBI refuses to file case on CBI special court orders

చెప్పాల్సినవాళ్ళు చెప్తేనే కేసు- సిబిఐ

Posted: 04/26/2014 09:00 AM IST
Cbi refuses to file case on cbi special court orders

తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కెసిఆర్, అదే పార్టీ నాయకుడు హరీష్ రావు, అంతకు ముందు అదే పార్టీలో ఎంపీగా పనిచేసిన విజయశాంతి మీద అవినీతిలో అడ్డదారిన డబ్బు సంపాదించిన కేసు నమోదు చెయ్యమని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం సిబిఐ ని ఆదేశించింది. 

అయితే హైకోర్టు కాని సుప్రీం కోర్టు కాని ఆదేశాలిస్తే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు సాగిస్తాం కానీ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం చెప్తే కాదంటూ సిబిఐ అందుకు బదులిచ్చింది.  కేంద్ర ప్రభుత్వం కాని, హైకోర్టు కాని, సుప్రీం కోర్టు కాని ఇచ్చిన ఆదేశాలను పాటిస్తాం కానీ ఇలా మేజిస్ట్రేట్ కోర్టుల ఆదేశాలను కూడా పాటిస్తూ పోతే కేసులకు అంతుపొంతు ఉండదని అందువలన కేసు పెట్టటం కుదరదని తేల్చి చెప్పింది సిబిఐ. 

రఘునందన్ ప్రైవేట్ పిటిషన్ ఆధారంగా సిబిఐ ప్రత్యేక కోర్టు కెసిఆర్, హరీష్ రావు, విజయశాంతి ల మీద కేసు నమోదు చెయ్యమని సిబిఐ ఎస్పీని కోరగా, అందుకు సిబిఐ ఎస్పీ పై విధంగా సమాధానమిచ్చారు.  సిబిఐ కేసుల విచారణ వరకే కానీ సిబిఐని ఆదేశించే అధికారం సిబిఐ ప్రత్యేక న్యాయస్థానానికి లేదని సిబిఐ స్పష్టం చేసింది. 

అయితే సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలను విస్మరించటం కూడా జరగదని, ఈ ఆదేశాల మీద హైకోర్టుకి వెళ్ళి సిబిఐ విధి విధానాలను వివరిస్తామని, ఆ తర్వాత హైకోర్టు ఆదేశానుసారం ప్రవర్తిస్తామని సిబిఐ అధికార ప్రతినిధి అన్నారు. 

రఘనందన రావు ఫిర్యాదుల ఆధారంగా న్యాయవాది బాలాజీ దాఖలు చేసిన పిటిషన్ లోని ఆరోపణలు ఇవి-

కెసిఆర్ తెలంగాణా ఉద్యమాన్ని తన స్వలాభం కోసం వాడుకున్నారు.  భారీగా ఆస్తులు కూడగట్టి వ్యక్తిగతమైన లాభాన్ని పొందారు.  తెరాస బహిష్కరించిన రఘునందనరావు కూడా దీనిమీద బహిరంగంగా టివి లో మాట్లాడారు.  కెసిఆర్, ఆయనతోపాటు సన్నిహితంగా పనిచేసిన హరీష్ రావు, విజయ శాంతి వసూళ్ళు, బెదిరింపులు, ఆశ్రిత పక్షపాతం, అవినీతి కార్యకలాపాలకు ఒడిగట్టారు.  దీనికి సంబంధించిన సిడిలు రఘునందనరావు దగ్గర ఉన్నాయి.  పద్మాలయ స్టూడియోకి కేటాయించిన భూమిలో ఉద్దేశిత అవసరాలకు అనుగుణంగా కార్యకలాపాలు జరగటం లేదని, ఆ భూమిని వెనక్కి తీసుకోవాలంటూ హరీష్ రావు హైకోర్టులో కేసు వేసారు.  ఆ తర్వాత దీని సెటిల్ మెంటు 80 లక్షలకు జరిగింది.  అది కూడా విజయశాంతి భర్త ఎమ్ వి శ్రీనివాస్  ప్రసాద్ సమక్షంలో జరిగింది.  ఆ సమయంలో అదిలాబాద్ కి చెందిన సినీ నిర్మాత కూడా అక్కడే ఉన్నారు.  ఈ విషయాన్ని అప్పటి సిబిఐ జెడి లక్ష్మీ నారాయణకు నివేదించటం జరిగింది.  వాన్ పిక్ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్ నుంచి 10 కోట్ల రూపాయలు వసూలు చేసి దానితో టివి ఛానెల్ ని ప్రారంభించారు.  ఎమ్మార్ లో కెసిఆర్ విల్లాలు, స్థలాలను పొందారు.  తెరాస కార్యాలయం కోసం ప్రభుత్వం కేటాయించిన భూమిలో టివి ఛానెల్ నడుపుతూ దాన్ని ప్రైవేటు సంస్థగా మార్చారు.  వీటి పైన పూర్తి స్థాయి దర్యాప్తును జరిపించాలి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles