Modi animation film theme song and books

Modi animation film, theme song and books, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014

Modi animation film, theme song and books

మోదీ సినిమా, మోదీ పాట, మోదీ పుస్తకాలు

Posted: 04/26/2014 08:02 AM IST
Modi animation film theme song and books

తిలకించినా, ఆలకించినా, ఆలపించినా ఆనందమొలకించే గాథ- అన్నట్లుగా మోదీ సినిమా, మోదీ పాట, మోదీ పుస్తకాలు విడుదల చేసింది ఆయన అభిమాన సంఘం.

అహ్మదాబాద్ కి చెందిన గుజరాత్ గౌరవ్ ఫ్యాన్స్ క్లబ్ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ జీవిత చరిత్ర ఆధారంగా తయారుచేసిన యానిమేషన్ చిత్రం నేషన్ ఇన్ మోషన్.  అలాగే నమో (నరేంద్ర మోదీ) పేరుతో ఒక థీమ్ సాంగ్ ని కూడా వాళ్ళు విడుదల చేసారు.  121 భాషల్లో నరేంద్ర మోదీ జీవిత చరిత్ర ఆధారంగా రాసిన పుస్తకాలను కూడా వాళ్ళు విడుదల చేసారు. 

ఈ సందర్భంగా, నరేంద్ర మోదీ చేసిన పనులతో ప్రభావితమయ్యాం కనుక ఆయన లైఫ్ సైజ్ ప్రతిమను, ఒక కాఫీ టేబుల్ పుస్తకాన్ని, నేషన్ ఇన్ మోషన్ అనే యానిమేషన్ చిత్రాన్ని విడుదల చేస్తున్నామంటూ గుజరాత్ గౌరవ్ ఫ్యాన్స్ క్లబ్ అధ్యక్షుడు రాజీవ్ ఛాజ్జర్ అన్నారు.  గుజరాత్ సంస్కృతిని ప్రాచుర్యం చెయ్యటం కోసం 2005 లో స్థాపించిన ఈ క్లబ్ అప్పటి నుంచి మోదీ ప్రచారంలో పని చేస్తోంది.  మోదీ ప్రధాన మంత్రైనట్లయితే దేశంలో ఉన్న సమస్యలన్నీ మటుమాయమైపోతాయన్నారు ఛాజ్జర్. 

గుజరాత్ ను కష్టాల నుండి గట్టెక్కించిన సూపర్ మాన్ గా నరేంద్ర మోదీని యానిమేషన్ లో చిత్రీకరించారు.   భారత దేశ చిత్రపటం ముందు సూపర్ మాన్ దుస్తుల్లో ఉన్న నరేంద్ర మోదీ 2001 భూకంపం నుంచి ప్రజలను రక్షించినట్లుగా చూపించారా చిత్రంలో. 

మేఘ్ ధనుష రాక్ బ్యాండ్ వారు నరేంద్ర మోదీ థీమ్ సాంగ్ ని తయారు చేసారు.  నరేంద్ర మోదీ చేసిన తొమ్మిది ప్రసంగాలను, మోదీ జీవితచరిత్ర లోని అంశాల ఆధారంగా రాసిన పది వేల కాఫీ టేబుల్ పుస్తకాలను క్లబ్ విడుదల చేసింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles