Ban jagan s paper till elections are over tdp asks ec

Ban Jagan's paper till elections are over TDP asks EC, assembly elections 2014, andhra elections 2014, telengana elections 2014, Lok Sabha elections 2014, General Elections 2014, elections 2014, andhra pradesh assembly elections 2014, andhra elections 2014

Ban Jagan's paper till elections are over TDP asks EC

జగన్ పత్రికను నిషేధించండి-తెదేపా

Posted: 04/26/2014 09:36 AM IST
Ban jagan s paper till elections are over tdp asks ec

వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వార్తా పత్రికలో చేసిన ప్రచురణలు ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘిస్తున్నాయని, గతంలో కూడా అలాగే చేసారని, అలా మళ్ళీ మళ్ళీ నేరానికి పాల్పడటం వలన ఆ పత్రికను ఎన్నికల పరిసమాప్తమయ్యేంత వరకు నిషేధించవలసిందిగ ఎన్నికల కమిషన్ కి తెలుగు దేశం పార్టీ నాయకుడు, పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణ విజ్ఞప్తి చేసారు.

యనమల రామకృష్ణుడు చేసిన ఫిర్యాదు ప్రకారం ఆ పార్టీ సొంత పత్రిక లో నాలుగు పేజీలను కేవలం నిజాన్ని వక్రీకరించి తమకు అనుకూలంగాను, తెలుగు దేశం పార్టీకి వ్యతిరేకంగానూ రాయటానికే కేటాయించింది, లోగడ ఆ పత్రికలో ఏప్రిల్ 2, 11, 24 తేదీల్లో కూడా అలాగే చేసింది.

ఆ వార్తా పత్రిక జర్నలిజంలోని అన్ని హద్దులనూ మీరిందని, కేవలం వైయస్ ఆర్ పార్టీ కరపత్రంలా తయారైందని తెదేపా నాయకుడన్నారు.  ఇంతవరకు ప్రచురితమైన అటువంటి కథనాలను పెయిడ్ న్యూస్ గా లెక్కించి ఆ పార్టీ ఎన్నికల ఖర్చుగా పరిగణించాలని తెదేపా ఎన్నికల కమిషన్ ని కోరుతోంది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles