Kcr attitude detrimental to telangana interests pawan says

KCR attitude detrimental to Telangana interests Pawan says, assembly elections 2014, andhra elections 2014, telengana elections 2014, Lok Sabha elections 2014, General Elections 2014, elections 2014, andhra pradesh assembly elections 2014

KCR attitude detrimental to Telangana interests Pawan says

కేంద్రంతో కెసిఆర్ పేచీతో, తెలంగాణా అభివృద్ధికి గండి- పవన్ కళ్యాణ్

Posted: 04/25/2014 04:23 PM IST
Kcr attitude detrimental to telangana interests pawan says

అవసరమైతే తన సినిమా జీవితాన్ని కూడా వదులుకోవటానికి సిద్ధమని అన్న సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, కెసిఆర్ అవలంబిస్తున్న వైఖరి వలన తెలంగాణా ప్రజలకు నష్టమే జరుగుతుందని పవన్ కళ్యాణ్ షాద్ నగర్ లో తన ఎన్నికల ప్రచార సభలో అన్నారు.  అయితే అభిమానులకోసం మరికొంతకాల సినిమాలు చేస్తానని కూడా పవన్ కళ్యాణ్ అభిమానులకు వాగ్దానం చేసారు. 

జనసేన పార్టీ ఆవిర్భవించిందే ప్రజాశ్రేయస్సులో ప్రశ్నించటానికేనని అన్న పవన్ కళ్యాణ్, భాజపా అభ్యర్థికి మద్దతుగా షాద్ నగర్ లో మాట్లాడుతూ, కేంద్రంలో పెద్దలతో గొడవ పెట్టుకుంటే తెలంగాణాలో అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. 

అయితే ఈ మాట వినగానే కెసిఆర్, కాంగ్రెస్ లో విలీనానికి కాని పొత్తుకి కాని ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచెయ్యటం వలన తెరాస కు నష్టమన్న ఉద్దేశ్యాన్నిపవన్ కళ్యాణ్ వెలిబుచ్చారనిపిస్తోంది కదూ.  అలా జరిగితే పప్పులో కాలేసినట్లే.

కొద్ది రోజుల క్రితం మోదీలేదు గీదీలేదు అని అంటూ కాబోయే ప్రధానమంత్రి మీద వ్యాఖ్యలు చేస్తే తెలంగాణా ప్రాంతానికి ఏ విధంగా ప్రయోజనం కలిగించగలరు అంటూ పవన్ కళ్యాణ్ అన్నారు.  తెలంగాణాలో యువకుల బలిదానాలు తన మనసుని గాయపరచాయని, అయితే వారి బలిదానాలు వృధాకాకుండా ఉండాలంటే కెసిఆర్ తన వైఖరిని మార్చుకోవలసి వుంటుందని అన్న పవన్ కళ్యాణ్, ఆ బలిదానాలు చేసిన త్యాగమూర్తుల అభిమతం నెరవేరకుండా ఏ పార్టీ అడ్డుతగిలి వ్యవహరించినా తను ప్రశ్నించటానికి తయారని ఆయన అన్నారు. 

తెలంగాణాను, తెలంగాణా ఉద్యమాన్ని తానెంతో గౌరవించానని అన్న పవన్ కళ్యాణ్ తన వ్యవసాయ క్షేత్రంలో తెలంగాణా వాదులు దాడి చేసినప్పుడు తాను వాళ్ళని అడ్డుకోలేక కాదని, కేవలం వాళ్ళ మీద గౌరవం వలనే ఏమీ చెయ్యకుండా ఉండిపోయానని ఆయన అన్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles