Do not lecture priyanka warns modi

Do not lecture Priyanka warns Modi, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014

Do not lecture Priyanka warns Modi

ఎబిసి పాఠాలు వద్దు- మోదీని వారించిన ప్రియాంకా!

Posted: 04/25/2014 03:37 PM IST
Do not lecture priyanka warns modi

మీరు క్లాసులో పాఠాలు చెప్పటం లేదు, ఒక దేశ ప్రజను సంబోధించి మాట్లాడుతున్నారు.  లెక్చరివ్వొద్దింక అన్న ప్రియాంకా, ద నుంచి దేశం, కా నుంచి కాకి సరే కానీ, బ నుంచి బస్ అంటే ఇక చాలు అన్నది కూడా తెలుసుకోమని మోదీకి సూచించారు,  

అంతకు ముందు ఎన్నికల సభల్లో మోదీ, దేశమంతా ఆర్ఎస్ వి పి తో నడుస్తోందని అన్నారు.  ఆర్ అంటే రాహుల్ గాంధీ, ఎస్ అంటే సోనియా గాంధీ, వి అంటే వాద్రా, పి అంటే ప్రియాంకా అని ఆయన వివరించారు.  అలాగే ఎబిసి అనే వాటిలో ఎ అంటే ఆదర్శ స్కామ్ అని, బి అంటే బోఫోర్స్ కేసని, సి అంటే కోల్ స్కామ్ అని అభివర్ణించారు.  అందువలన అమ్మ సోనియా గాంధీ ఎన్నికలకు రాయ్ బరేలీలో ప్రచారం చేస్తున్న ప్రియాంకా ఆ విధంగా మోదీ మాటలను తిప్పికొట్టారు.  

అంతే కాదు, గుజరాత్ లో ని ఆదర్శగ్రామాన్ని అందరూ అర్థం చేసుకుంటున్నారని ఆమె అన్నారు.  మోదీనీ ఉద్దేశిస్తూ, మీరు ఆ ఆదర్శ గ్రామంలోని భూమిని మీ స్నేహితులకు ఏవిధంగా అతి తక్కువ ధరకు కట్టబెట్టారో కూడా దేశవాసులు అర్థం చేసుకున్నారు.  మీ ఆదర్శ గ్రామంలోని రైతుల స్థితి గురించి, మహిళలకు మీరు ఏం చేసారన్నదాన్ని గురించి కూడా మీరు చెప్పవలసివుంది అన్నారు ప్రియాంక.  

ఆ తర్వాత చివరగా, దేశ సమైక్యతను కాపాడాలంటే కాంగ్రెస్ పార్టీకే వోటేసి గెలిపించవలసిందిగా ప్రియాంక కోరారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles