Nara lokesh attacked in pebberu

Nara Lokesh attacked in Pebberu, assembly elections 2014, andhra elections 2014, telengana elections 2014, Lok Sabha elections 2014, General Elections 2014, elections 2014, andhra pradesh assembly elections 2014, andhra elections 2014

Nara Lokesh attacked in Pebberu

నాకే భద్రత లేదు ఇక మీమాటేంటి అన్న లోకేశ్!

Posted: 04/21/2014 09:58 AM IST
Nara lokesh attacked in pebberu

బీరు సీసాలు, మామిడి కాయలను విసురుతూ వనపర్తి నియోజకవర్గం పెబ్బేరులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కుమారుడు లోకేశ్ ప్రసంగాన్ని తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేసారు.  

మొదట్లో నిబ్బరంగా నిలబడి ప్రసంగాన్ని కొనసాగించినా, పోలీసులు అప్రమత్తంగా మెలిగినా,  మరోసారి మామిడికాయలతో దాడి జరగటంతో భద్రతా సిబ్బంది లోకేశ్ ని సురక్షితంగా వ్యాన్ లోకి తరలించారు.  

దాడి చేసిన మనిషిని గుర్తించిన తెదేపా కార్యకర్తలు అతని మీద ఎదురుదాడికి దిగి, అతని కారులో బీర్ సీసాలుండటం గమించి దానికి నిప్పంటించారు.  జరుగుతున్న గొడవకి భయపడ్డ జనం కూడా తలా ఒక దిక్కు పరుగులు తీసారు.  

గందరగోళ పరిస్థితి నెలకొనటంతో వాహనం మీది నుంచి దిగబోయి కాలు విరగ్గొట్టుకున్నారు నాగర్ కర్నూల్ తెదేపా పార్లమెంట్ అభ్యర్థి బక్కని నర్సింహులు.  కొత్తకోట సిఐ చేతికి గాయం కూడా అయింది.  

తాను దాడులకు భయపడనని అన్న లోకేశ్, తెరాస అధ్యక్షుడు కెసిఆర్ కి గెలుస్తానన్న నమ్మకం లేకనే లోక్ సభకు, అసెంబ్లీకి కూడా నామినేషన్ వేసారని, ముఖ్యమంత్రి అభ్యర్థైయ్యుండి ఎవరైనా అలా చేస్తారా అని ప్రశ్నించారు.  మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్లలో ప్రసంగిస్తూ, నాకే భద్రత లేనప్పుడు తెలంగాణాలో ఇక సామాన్యిడికేముంటుందని లోకేశ్ ఆవేదనను వ్యక్తం చేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles