Senior congress leaders that kept away from elections

Senior congress leaders that kept away from elections, assembly elections 2014, andhra elections 2014, telengana elections 2014, Lok Sabha elections 2014, General Elections 2014, elections 2014, andhra pradesh assembly elections 2014, andhra elections 2014

Senior congress leaders that kept away from elections

రాజకీయ సన్యాసం పుచ్చుకున్న నేతలు?

Posted: 04/21/2014 08:53 AM IST
Senior congress leaders that kept away from elections

కాంగ్రెస్ పార్టీలో అతిరథ మహారథులుగా పేరుమోసిన హేమా హేమీలు ఈసారి రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారు. 
ఎన్నో మాటలు మాట్లాడి, సభలు నిర్వహించి, బీరాలు తీసి చివరకు ఎన్నికలలోనే పత్తా లేకుండా పోయిన నాయకులు వీరే.

సీమాంధ్రలో కిరణ్ కుమార్ రెడ్డి, కావూరి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్, వట్టి వసంత కుమార్, కాసు వెంకట కృష్ణా రెడ్డి, ఆనం వివేకానందరెడ్డి, డిఎల్ రవీంద్రారెడ్డి, డొక్కా మాణిక్య వరప్రసాద్, అహ్మదుల్లా,  ఎన్నికలకు దూరంగా ఉన్నారు.  

ఇక టికెట్ దొరకక తెలంగాణాలో ఎన్నికలలో పోటీచేయలేని వారు వీరు-

తెలంగాణాలో సబితా ఇంద్రారెడ్డి, సోనియా గుడికట్టిన శంకరరావు తనకు కాని తన కుమార్తెకు కానీ సీటు దక్కించుకోలేకపోయారు. 

రాష్ట్ర విభజన విషయంలో ఆఖరు బంతి వరకు ఓటమిని అంగీకరించనని చెప్పిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర పార్టీని కూడా స్థాపించి చివరకు ఎన్నికల రణరంగంలోచే వైదొలగారు.  మా తండ్రి గారి కాలం నుంచి కాంగ్రెస్ కి విశ్వాసపాత్రులుగా పనిచేస్తున్నామని చెప్పుకుంటూ వచ్చిన కిరణ్ కుమార్ రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ అధిష్టానానికి ఎదురు నిలిచి పోటీగా పార్టీ పెట్టి చివరి క్షణంలో తన బదులు తన తమ్ముడిని పోటీలో నిలబెట్టి తాను తప్పుకున్నారు. 

ఏలూరు నియోజకవర్గానికి చెందిన కావూరి సాంబశివరావు కూడా సుదీర్ఘకాలంగా పనిచేస్తూ వస్తున్న రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.  కాంగ్రెస్ లో ఉండలేక, మరో పార్టీలోకి వెళ్ళలేక, కొత్త పార్టీ విజయం మీద నమ్మకం లేక చివరకు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. 

ఇక తమ మాటలతో తూటాలు పేల్చే రాజమండ్రి నియోజకవర్గానికి చెందిన ఉండవల్లి అరుణ్ కుమార్, విజయవాడ కు చెందిన లగడపాటి రాజగోపాల్ సమైక్యాంధ్ర సభలలో హాజరైనా, చివరకు ఎన్నికలనే సరికి ఆమడ దూరం వెళ్ళిపోయారు. 

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కాసు వెంకట కృష్ణారెడ్డికి ఆయన కుమారుడికీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వటానికి సిద్ధమవగా, లేదులెండి మీరు వేరే మంచి అభ్యర్థులను తీసుకోండి అంటూ సున్నితంగా తిరస్కరించారు. 

మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడికి పార్టీ టికెట్ ఇవ్వటం వలన, కుటుంబానికి ఒకే టికెట్ అనే సిద్ధాంతానికి ఈసారి కట్టుబడివున్న కాంగ్రెస్ పార్టీ సబితా ఇంద్రారెడ్డికి ఎన్నికలలో పోటీ చేసే అవకాశమే ఇవ్వకపోగా, మాజీ మంత్రి శంకరరావు సోనియా విగ్రహం పెట్టి, మందిరం కట్టి, పూజలు నిర్వహించినా ఆయనకు కాని ఆయన ఆశించినట్లుగా ఆయన కుమార్తెకు కానీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు. 

ఇందులో పూర్తిగా రాజకీయ వైరాగ్యంతో సన్యసించినవారెంతమందో, కేవలం పరిస్థితుల దృష్ట్యా తలవొగ్గి ప్రస్తుతానికి తెరవెనుక విశ్రాంతి తీసుకునేవారెవరో తెలియదు!

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles