Congress party gaining momentum in telangana

Congress party gaining momentum in Telangana, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014

Congress party gaining momentum in Telangana

తెరాస కాంగ్రెస్ మధ్య తూటాలు, పుంజుకుంటున్న కాంగ్రెస్

Posted: 04/21/2014 07:34 AM IST
Congress party gaining momentum in telangana

రాజకీయాలలో మిత్రుడు కాకపోతే శత్రువే కానీ మధ్యస్తంగా ఏమీ కాకుండా ఉండడని తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు నిరూపించారు.  కాంగ్రెస్ లో విలీనం కాలేదు సరే, పొత్తు కూడా లెదన్నారు అదీ సరే కానీ కాంగ్రెస్ పోటీయే చెయ్యగూడదంటే ఎలా.

అయితే ఈ సారి తెరాస వ్యూహానికి కాంగ్రెస్ మొదటి నుంచే గండి కొట్టింది.  అదేమిటంటే తెలంగాణాలో ప్రచారం చేసుకోగలగటం.  పోయిన రెండు సార్లు తెలంగాణా రాష్ట్రం ఇవ్వని నేరాన్ని కాంగ్రెస్ నాయకుల మెడకు చుట్టి వాళ్ళని అసలు ప్రచారంలోకే రాకుండా చెయ్యటం వలన కెసిఆర్ చెప్పిందే సత్యమైంది.  అప్పటి కాంగ్రెస్ నాయకులు కూడా అధిష్టానం ఏ సంగతీ తేల్చకుండా నాన్చటంతో విసిగిపోయి వున్నారు. 

కొందరు కాంగ్రెస్ నాయకులను తెరాస లోకి ఆహ్వానించటం, మిగిలినవారిని రాజీనామా చెయ్యాలని వత్తిడి తేవటం చేసిన కెసిఆర్, జనం మిమ్మల్ని ఊళ్ళల్లోకి రానివ్వరంటూ నాయకులను భయభ్రాంతులను చేసారు.  ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారీ, చిత్త శుద్ధి ఉంటే తెలంగాణా రాష్ట్రం కోసం అధిష్టానాన్ని ఒప్పించాలని కాంగ్రెస్ నాయకులకు సవాళ్ళు విసరంటం చేసి మొత్తానికి తెలంగాణా కాంగ్రెస్ నాయకులను నిర్వీర్యం చేసారు. 

కానీ ఈసారి తెలంగాణా రాష్ట్రం ఏర్పడటం, దానికోసం చివరి వరకూ పట్టు విడవకుండా సోనియా గాంధీ చేసిన కృషి అందరికీ తేటతెల్లంగా తెలియటం దానికి తోడు పిసిసిలను కూడా విభజించి తద్వారా ప్రచారానికి కాంగ్రెస్ నాయకులను సిద్ధం చేయటం చేసిన కాంగ్రెస్, సోనియా గాంధీ పర్యటన, ఇప్పడు రాహుల్ గాంధీ పర్యటనలతో ప్రచారం పుంజుకుంటోంది.

అంతేకాదు గత ఎన్నికలలో కెసిఆర్ ప్రచారం పూర్తిగా మీడియా కవరేజ్ లోకి రాకపోవటం వలన ఆయన ఏ  ప్రాంతంలో ఎలా మాట్లాడుతున్నారన్నది తెలియలేదు, దానితో ఆయన మాట్లాడిందే సత్యం, పలికిందే వేదమైంది.  దానితో ఆయన కాంగ్రెస్, తెదేపాలు తెలంగాణా రాష్ట్రంలో శక్తిహీనులైపోయారు. 

కానీ ఇప్పుడు కాంగ్రెస్ పుంజుకోవటం, తెదేపా భాజపాతో పొత్తు పెట్టుకోవటంతో కెసిఆర్ తన వ్యూహాన్ని మార్చుకోవలసిన అవసరం ఉంది.  తెలంగాణా రాష్ట్రం వచ్చినా ఇంకా పోరు సమసిపోలేదని, అసలు తతంగమంతా ఇప్పుడే ఉందని, కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రులు చెప్పనట్టుగా వింటుందని, రాష్ట్ర విభజనలో అన్యాయం జరగకుండా ఉండాలంటే అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు తెరాసకే పడి అఖండ విజయంతో గెలిపించటం అవసరమని కెసిఆర్ ప్రచారం చేస్తున్నారు. 

అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు, ముఖ్యం టిపిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మాత్రం కెసిఆర్ కి దీటుగా సమాధానం చెప్పటం, ఫాం హౌస్ లో ఫాల్తు ముచ్చట్లు కట్టిపెట్టమని చెప్తూ ఆయన భాషలోనే బదులిస్తున్నారు. 

అదీ కాంగ్రెస్ వ్యూహం.  తెరాస ను ఈసారి కాస్త ఇరుకున పడేసింది ఆ వ్యూహం.  గత ఎన్నికలలో ఎందుకు సమస్యలు ఎదురయ్యాయన్నది విశ్లేషించిన కాంగ్రెస్ పార్టీ ఈ సారి అటువంటి వి రాకుండా ముందునుంచే జాగ్రత్త తీసుకున్నట్లు, అందుకే పిసిసిలను విభజించినట్లు తెలుస్తోంది.  దాని ఫలితం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles