Justice rm lodha to be next chief justice of india

Chief Justice of India, India, Rajendra Mal Lodha, RM Lodha, Supreme Court

Justice Rajendra Mal Lodha has been appointed as the next Chief Justice of India and he will assume his charge on April 27.

సుప్రీం ప్రధాన న్యాయ మూర్తిగా ఆర్. ఎమ్. లోధా

Posted: 04/11/2014 07:36 PM IST
Justice rm lodha to be next chief justice of india

భారత అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆర్.ఎం. లోధా నియమితులయ్యారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్న జస్టిస్ సదాశివం పదవీ కాలం ఈనెల 26 తేదీన ముగియనుండటంతో కొత్త ప్రధాన న్యాయమూర్తిగా ఏప్రిల్ 27 తేదీన బాధ్యతలు చేపట్టనున్నారు.

త్వరలో బాధ్యతలు చేపట్టనున్న లోధా రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వారు. 1994లో రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులు అయ్యారు. అదే సంవత్సరం బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు. బాంబే హైకోర్టులో న్యాయమూర్తిగా 13 సంవత్సరాలు బాధ్యతలు నిర్వహించిన ఆయన తిరిగి 2007లో రాజస్థాన్ హైకోర్టుకు బదిలీ పై తిరిగి వచ్చారు.

2008లో పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన అదే ఏడాది సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా భాధ్యతలు స్వీకరించారు. మహిళల పై జరుతున్న యాసిడ్ దాడుల నియంత్రణకు రిటైల్ యాసిడ్ అమ్మకాల పై నిషేధం విధించడమే కాకుండా, మూడు లక్షల నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వం చెల్లించాలని ఆదేశించారు. ఈయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఐదునెలల ( ఏప్రిల్ 27 నుండి సెప్టెంబర్ 27 వరకు) పాటు బాధ్యతల్ని నిర్వర్తించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles