Cartoon of ec handled by sonia as dog

Cartoon of EC handled by Sonia as dog, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections

Cartoon of EC handled by Sonia as dog

ఇసిని మమతా మీద ఉస్కో అంటున్నట్లుగా కార్టూన్

Posted: 04/11/2014 04:52 PM IST
Cartoon of ec handled by sonia as dog

కోల్కతా శివారు ప్రాంతమైన కొన్నాగర్ లో గుర్తుతెలియని వ్యక్తులు అంటించిన పోస్టర్ ఎన్నికల కమిషన్ మీద కక్షతీర్చుకోవటానికా లేక ఎన్నికల కమిషన్ కి మమతా మీద మరింత కోపం పెరగటానికా అన్నది అర్థం కావటంలేదు. 

ఆ పోస్టర్ లో సోనియా గాంధీ చేతిలో కుక్క మెడలోని గొలుసు ఉంది, ఆ కుక్క ముఖంలో కేంద్రం నుంచి డెప్యూటేషన్ లో పశ్చిమ బెంగాల్ వచ్చిన డెప్యూటి ఎలక్షన్ కమిషనర్ వినోద్ జుట్షి ముఖం ఉంది.  ఎదురుగా ఉన్న మమతా బెనర్జీ మీదకు లేచి నిలబడ్డ ఆ కుక్కను మమత వేలెత్తి వారిస్తున్నట్లుగా ఉంది. 

మమతా బెనర్జీ జుట్షిని తొలగించమని, ఆయన మీద నేరారోపణ ఉందని, ఆయన బెయిల్ ఉన్నారు కాబట్టి అక్కడ పనిచెయ్యటానికి అర్హులు కారని, ఆయన ఎన్నికల కమిషన్ ని తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. 

ఈ రోజు జుట్షి పశ్చిమ బెంగాల్ డిజిపిని ఎన్నికల అధికారుల మీద చెయిచేసుకున్నవారిని అరెస్ట్ చెయ్యమని ఆదేశించారు.  మాల్డాలో జరిగిన ఘటన పూర్తి వీడియో ఫుటేజ్ ఆధారంగా ఇప్పటికే ముగ్గురు పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకునివున్నారు. 

అంతకు ముందు కొందరు పోలీసు ఉన్నాతాధికారులను, మేజిస్ట్రేట్ లను బదిలీ చెయ్యమని ఆదేశించగా ఆయనకు మమతా బెనర్జీకి మధ్య వాగ్వివాదం, సవాళ్ళు ప్రతిసవాళ్ళు నడిచాయి. 

ఒకవేళ జుట్షిని సోనియా చేతిలో కుక్కలా వేసిన పోస్టర్ మమతా బెనర్జీ ప్రమేయం లేకుండా ఎవరైనా అక్కడ అంటించివున్నట్లయితే అమాయకంగా ఆమె మీద అభిమానంతో నైనా చేసుండాలి, లేదా ఆమె మీద మరింత ఒత్తిడి పెంచటం కోసం ఆమె శత్రువులైనా చేసుండాలి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles